AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమ్మ, చెల్లిని నాన్న చంపేశాడు.. గుక్కపెట్టి ఏడ్చేసిన ఇద్దరు చిన్నారులు

హైదారాబాద్ మహానగరంలోదారుణం వెలుగు చూసింది. అనుమానం మూడు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, పాపను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Hyderabad: అమ్మ, చెల్లిని నాన్న చంపేశాడు.. గుక్కపెట్టి ఏడ్చేసిన ఇద్దరు చిన్నారులు
Crime News
Balaraju Goud
|

Updated on: Jul 21, 2024 | 11:55 AM

Share

హైదారాబాద్ మహానగరంలోదారుణం వెలుగు చూసింది. అనుమానం మూడు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, పాపను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

మహారాష్ట్రకు చెందిన గణేష్ నాలుగు నెలల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. భార్య స్వప్న, ముగ్గురు పిల్లలతో కలిసి బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా భార్య స్వప్నపై అనుమానం పెంచుకున్న గణేష్ ఘర్షణ పడుతున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పది నెలల చిన్న పాప తోపాటు భార్య స్వప్నను గొంతు నులిమి హతమార్చాడు. భార్య, పిల్లల్ని చంపేసి అనంతరం తాను కూడా అల్వాల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అంతకుముందే నిందితుడు గణేష్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పి మరీ తాను హత్య చేసిన విషయాలను పోలీసులకు చెప్పాడు. అంతేకాక, తాను కొద్దిసేపటి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు కూడా పోలీసులకు తెలిపాడు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వీరి సంతానం మరో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనకు సంంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్ పల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?