ఒంటిమీద తెల్లకోటు.. మెడలో స్టెతస్కోప్.. డాక్టర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే..!

ఒంటిమీద తెల్లకోటు.. మెడలో స్టెతస్కోపు.. రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి, హాస్పిటల్ మొత్తం కలియ తిరగాడు. చివరికి ఆపరేషన్ థియేటర్‌కు కూడా వెళ్లాడు. చివరికి వైద్య సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలోకి వెళ్ళిన డాక్టర్ నీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటు న్నారా..? ఈ స్టోరీ చదివితే అందరూ షాక్ అవుతారు.

ఒంటిమీద తెల్లకోటు.. మెడలో స్టెతస్కోప్.. డాక్టర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే..!
Fake Doctor Arrest

Edited By: Balaraju Goud

Updated on: Dec 13, 2025 | 6:10 PM

ఒంటిమీద తెల్లకోటు.. మెడలో స్టెతస్కోపు.. రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి, హాస్పిటల్ మొత్తం కలియ తిరగాడు. చివరికి ఆపరేషన్ థియేటర్‌కు కూడా వెళ్లాడు. చివరికి వైద్య సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలోకి వెళ్ళిన డాక్టర్ నీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటు న్నారా..? ఈ స్టోరీ చదివితే అందరూ షాక్ అవుతారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన భాను అనే యువకుడు, గత కొద్ది రోజులుగా సిద్దిపేటలో ఉంటున్నాడు. భానుకు చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని కోరిక ఉండేది. అతను చదివింది కేవలం ఇంటర్మీడియెట్. అనుకొని పరిస్థితి వల్ల అతను డాక్టర్ కాలేక పోయాడు. దీంతో ఆ కోరిక అలానే ఉండిపోయింది. అందుకే ఆ కోరిక ఎలాగైనా తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆన్‌లైన్‌లో డాక్టర్లు వేసుకునే డ్రెస్ తెప్పించుకున్నాడు. అచ్చు డాక్టర్ లాగే రెడీ అయ్యాడు.

ఈ క్రమంలోనే ప్రతి రోజు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి.. ఆసుపత్రి మొత్తం రోజు కలియ తిరిగాడు. ఇంతంటితో ఆగకుండా ఆపరేషన్ థియేటర్‌లోకి సైతం వెళ్లడంతో అనుమానం వచ్చింది. ఆసుపత్రి RMO పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు భానుని అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కు తరలించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపెట్టాడు.

ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతారు.. కానీ.. ఆన్‌లైన్ డాక్టర్ డ్రెస్ కుంటే డాక్టర్ ఎలా అయితారు. అని అందరు అనుకుంటున్నారు. చిన్నప్పటి నుండి డాక్టర్ కాలేకపోయానని ఈ విధంగా నైనా తన డాక్టర్ కల నెరవేరుతుందేమో అని ఇలా తిరిగానని పోలీసులతో చెప్పాడట భాను. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..