Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 50 మందిపై కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసులు ఉన్న నాయకుల్లో 78 శాతం మంది అధికార పార్టీ (కాంగ్రెస్‌) ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలలో 19 మంది (48 శాతం)పై కేసులు ఉన్నాయని ఎన్జీవో తెలిపింది. బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రకంగా బీజేపీలో అత్యధికంగా...

Telangana: తెలంగాణలో ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..
Criminal Cases On Mlas
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2023 | 12:39 PM

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 16 మందిపై తెలంగాణ ఉద్యమం, మోడల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఎన్జీవో సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 50 మందిపై కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసులు ఉన్న నాయకుల్లో 78 శాతం మంది అధికార పార్టీ (కాంగ్రెస్‌) ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలలో 19 మంది (48 శాతం)పై కేసులు ఉన్నాయని ఎన్జీవో తెలిపింది. బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రకంగా బీజేపీలో అత్యధికంగా 87 శాతం ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి.

ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో నలుగురిపై (57 శాతం) కేసులు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పార్టీలు గెలుపే ప్రమాణంగా తీసుకుంటున్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి అన్నారు. గత నెలలో, ఎన్జీవో అభ్యర్థుల నేర చరిత్రను విశ్లేషించింది, నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన 226 మంది నామినీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఒక కమిటీ విశ్లేషించి నివేదికను సిద్ధం చేసింది.

కాంగ్రెస్‌లోని 118 మంది అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులున్న తెలంగాణ నేతల్లో.. టీసీసీసీ చీఫ్‌.. రేవంత్‌ రెడ్డి 89 కేసులు ఉన్నాయి. తర్వాత ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన వెడ్మ బొజ్జుపై 52 కేసులు, మంచిర్యాలకు చెందిన కొక్కిరాల ప్రేంసాగర్ రావుపై 32 కేసులు ఉన్నాయి. వీరంతా తాజాగా విజయం సాధించారు. ఇక గోషామహల్ నుంచి రెండోసారి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్‌పై 89 కేసులున్నాయి.

ఇక కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికైన బీఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్‌పై 10 కేసులు ఉన్నాయి. గజ్వేల్ నుంచి మళ్లీ ఎన్నికైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై తొమ్మిది కేసులున్నాయి. అలాగే.. సిరిసిల్ల నుంచి రెండోసారి ఎన్నికైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఎనిమిది కేసులున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఆరు కేసులు ఉండగా, మరో ముగ్గురిపై ఒక్కో కేసు ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..