ఘోరం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న కూలీలు గ్రానైట్ బండ కింద సమిధలయ్యారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. లారీ నుంచి గ్రానైట్ రాయి జారి.. పక్కనే వెళ్తున్న ఆటోపై పడిపోయింది. ఆ గ్రానైట్ రాయి దెబ్బకు ఆటో నుజ్జునుజ్జు కాగా.. నలుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌తో కలిపి 11 మంది ఉన్నారు. నలుగురు స్పాట్‌లో చనిపోయారు. గ్రానైట్ రాయి కింద పడి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మిగతావారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రానైట్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కూలీ పనులు చేసి ఆటోలో ఇళ్లకు వెళ్తుండగా.. అటుగా వెళ్తున్న లారీ నుంచి గ్రానైట్ రాయి జారిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులు మరిపెడ మండలం, మంగోరిగూడెం గ్రామస్థులుగా పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా లేకుండా గ్రానైట్ తరలించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..