AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అరె.! అలా కాదురా పిచ్చోడా.. 77 సార్లు డయల్ 100కి కాల్ చేస్తారా.? పోలీసుల రియాక్షన్ ఇదే

తాగిన తమాషా అంటే ఇదేనేమో.. తాగిన తర్వాత మనుషులు వివిధ రకాలుగా చేస్తారు. కానీ వీడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తాగిన తర్వాత నేరుగా పోలీసులతోనే పెట్టుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 సార్లు 100 డయల్ చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు.

Telangana: అరె.! అలా కాదురా పిచ్చోడా.. 77 సార్లు డయల్ 100కి కాల్ చేస్తారా.? పోలీసుల రియాక్షన్ ఇదే
Telangana
P Shivteja
| Edited By: |

Updated on: May 09, 2025 | 5:25 PM

Share

తాగిన తమాషా అంటే ఇదేనేమో.. తాగిన తర్వాత మనుషులు వివిధ రకాలుగా చేస్తారు. కానీ వీడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తాగిన తర్వాత నేరుగా పోలీసులతోనే పెట్టుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 సార్లు 100 డయల్ చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు ఈ తాగుబోతును పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ అనే వ్యక్తి గత ఆరు నెలల్లో మద్యం మత్తులో 77 సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ డయల్ 100కి కాల్ చేశాడు. అతడు ప్రతీసారి ఊరి పేరు తప్పు చెప్తూ.. తన పేరు వేరుగా చెబుతూ.. తాను చనిపోతున్నానని, భార్య కనిపించడం లేదని, తాను పెట్రోల్ పోసుకున్నానని ఇలా వివిధ అబద్ధాలతో పోలీసుల సేవలను దుర్వినియోగం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ చర్యల వల్ల పోలీసులు అవసరమైనవారికి సకాలంలో సహాయం అందించలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత కొరకు ఏర్పాటు చేసిన డయల్ 100 సేవను అలా దుర్వినియోగం చేయడం నేరమని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సురేష్‌ను అదుపులోకి తీసుకొని, అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇదే తరహాలో మరెవరైనా మద్యం మత్తులో లేదా ఉద్దేశపూర్వకంగా డయల్ 100 సేవను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఫుల్‌గా తాగి గొడవలు పెట్టుకునే వారిని చూశాం కానీ.. ఇలా 100 నెంబర్‌కి ఫోన్లు చేసి పోలీసులను ఇబ్బందులకు గురి చేసిన వీడిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..