Telangana: ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు.. వాగులో కనిపించిన అదో మాదిరి ఆకారం.. దగ్గరకు వెళ్లగా
ఉదయాన్నే కొందరు స్థానికులు అడవి దగ్గరలోనే వాగు దగ్గరకు కట్టెలు కొట్టేందుకు వెళ్లారు. ఇక వారికి ఆ వాగులో ఏదో కదలుతూ కనిపించింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా దెబ్బకు దడుసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం మర్రిగూడెం అటవీ ప్రాంతంలో ఆదివాసి గ్రామపెద్ద గుత్తి మడవి నంద అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపారు ఇద్దరు వ్యక్తులు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వాగులో మృతదేహాన్ని పడేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని మర్రిగూడెం ఆదివాసి గుంపు గ్రామానికి చెందిన గొత్తి కోయ పద్ధం నందయ్య(56) అనే గ్రామ పెద్దను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు.
రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులు నందయ్యను హత్య చేసి మృతదేహాన్ని గ్రామం సమీపంలోని వాగులో పడేసినట్లు సమాచారం అందింది. ఉదయం స్థానికులు వాగులో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ప్రతాప్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో మంత్రాల అనుమానం ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
