Kamareddy Road Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం మెనూరు వద్ద 161 జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను.. అటుగా వస్తున్న లారీ వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయి లారీ కింద చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తోంది. ఆటో మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో అదుపుతప్పిన ఆటో.. ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆటో లారీ కిందకు దూసుకెళ్లి.. నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి