Telangana: జొన్న పంట భలే ఏపుగా పెరిగిందనుకునేరు.. డ్రోన్లు ఎగరేసి చూడగా దిమ్మతిరిగింది

కొమురంభీం జిల్లా ఏజెన్సీలో మత్తు దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పత్తి పంట మాటున గంజాయి సాగు చేస్తుండడంపై కన్నెర్ర చేస్తున్నారు. గుట్ట పొలాలను గంజాయి సాగుకు అడ్డాగా చేసుకోవడంతో డేగ కన్నేసి కేటుగాళ్ల బెండు తీస్తున్నారు. ఏకంగా.. ఆసిఫాబాద్‌ జిల్లా ఏఎస్పీ రంగంలోకి దిగడంతో ఏజెన్సీలో గంజాయి గుట్టురట్టు అవుతోంది.

Telangana: జొన్న పంట భలే ఏపుగా పెరిగిందనుకునేరు.. డ్రోన్లు ఎగరేసి చూడగా దిమ్మతిరిగింది
Maize Crop

Updated on: Oct 13, 2025 | 8:02 AM

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీ మండలాల్లోని మారుమూల గ్రామాలను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి దళారులు రెచ్చిపోతున్నారు. అమాయక రైతులకు డబ్బుల ఆశ చూపి అంతర పంటగా గంజాయి సాగు చేయిస్తున్నారు. గుట్టుగా ఉంటుందనే ధ్యాసతో గుట్ట ప్రాంతాలను గంజాయి సాగుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రధానంగా.. ఏజెన్సీ మండలాలైన జైనూరు, కెరమెరి, సిర్పూరు(యు), లింగాపూర్‌ మండలాల్లోని తండాల్లో పత్తి, బంతిపూలు, మొక్కజొన్న పంటల మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా దందా కొనసాగిస్తున్నారు. చింతలమానెపల్లి, బెజ్జూరు, వాంకిడి మండలాల్లోని మారుమూల గ్రామాల్లోనూ అంతర పంటగా గంజాయి సాగవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎక్కడపడితే అక్కడ తనిఖీల్లో గంజాయి పట్టుబడుతున్న నేపథ్యంలో ఆసిఫాబాద్‌ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో గుట్టురట్టు అవుతోంది.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

అంతర పంటల్లో గంజాయి సాగుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన కొమురం భీం జిల్లా పోలీసులు కొన్నాళ్లుగా మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొమురం భీం జిల్లా కెరమెరి మండలం నారాయణగూడలోని పంట పొలాల్లో గంజాయి సాగుపై స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్పీ చిత్తరంజన్‌.. గుట్ట ప్రాంతంలోని పంట పొలాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డ్రోన్లతో రంగంలోకి దిగిన ఆయన.. ఓ వ్యక్తికి చెందిన పంట పొలంలో సుమారు 50 గంజాయి మొక్కలను గుర్తించి పీకి పడేశారు. స్వయంగా ఏఎస్పీనే పత్తి చేనులోని గంజాయి మొక్కలను తొలగించారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. లింగాపూర్ మండలం గుమ్నూర్ (కె) గ్రామ పరిధిలోని పంట చేనులోనూ 30 మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. ఇక.. ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి సాగు చేస్తూ కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

గత కొన్ని రోజులుగా ఏజెన్సీలోని పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తుండడంపై కొమురం భీం జిల్లా పోలీసులు ప్రత్యేకంగా కన్నేశారు. జిల్లాలో నిత్యం ఏదో ప్రాంతంలో గంజాయి ఆనవాళ్లు లభిస్తుండడంతో డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. అందులోనూ.. ఏజెన్సీలోని గుట్ట ప్రాంతాలను అడ్డాగా చేసుకోవడంతో డ్రోన్ల ద్వారా అంతర పంటల్లోని గంజాయి పని పడుతున్నారు. ఒక్క ఆసిఫాబాద్ డివిజన్‌లోనే 500లకు పైగా గంజాయి మొక్కలను ధ్వంసం చేయడంతో పాటు భారీగా కేసులు నమోదు అవుతుండడం సంచలనంగా మారింది.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు