AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. మరో చిన్నారి ప్రాణం తీసిన కుక్కలు.. ఇంటి బయట ఆడుకుంటుండగా..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా

Telangana: అయ్యో దేవుడా.. మరో చిన్నారి ప్రాణం తీసిన కుక్కలు.. ఇంటి బయట ఆడుకుంటుండగా..
Dogs Attack
Shaik Madar Saheb
|

Updated on: Mar 13, 2023 | 8:20 PM

Share

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ పంచాయతీలో జరిగింది. ఆదివారం కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. పుటానితండాకు చెందిన బానోతు భరత్ (5) ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో వీధిలో ఉన్న కుక్కలు బాలుడిపై అకస్మాత్తుగా దాడి చేశాయి.

దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతరం స్థానికులు.. హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కుక్కల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో వీధి కుక్కలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..