Telangana: దారుణం.. 13 ఏళ్ల బాలికకు 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు..

రోజురోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. బాల్యవివాహాలను నిషేధించినప్పటకీ ఇంకా కొందరు వాటిని పాటిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ 13 ఏళ్ల బాలికకు 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించడం కలకలం రేపుతోంది.

Telangana: దారుణం.. 13 ఏళ్ల బాలికకు 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు..
Marriage
Follow us
Prabhakar M

| Edited By: Ravi Kiran

Updated on: Jul 10, 2023 | 10:02 AM

రోజురోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. బాల్యవివాహాలను నిషేధించినప్పటకీ ఇంకా కొందరు వాటిని పాటిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ 13 ఏళ్ల బాలికకు 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించడం కలకలం రేపుతోంది. నవీపేట మండలంలోని ఓ తండాలో శుక్రవారం జరిగిన ఈ వివాహం తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే ఆ తండాకు చెందిన బాలిక(13) కు ఫకీరాబాద్‌కు చెందిన సాహెబ్ రావు అనే 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే వీళ్లు అక్కడికి వచ్చేలోపే సాహెబ్‌రావు ఆ బాలికను తీసుకొని వెళ్లిపోయాడు.

Girl

ఇవి కూడా చదవండి

మరోవైపు పెళ్లిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులు, అధికారులతో ఆ తండా స్థానికులు వాగ్వాదానికి దిగారు. అనంతరం డీసీపీవో చైతన్య కుమార్ ఆధ్వర్యంలో కుమారు శనివారం రోజన ఆ తండాకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. 13 ఏళ్ల బాలికను బాల్యవివాహం చేసుకున్న సాహెబ్‌రావుతో పాటు వివాహానికి సహకరించిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైమద్ అనే కార్యదర్శి నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రజాసంఘాల నాయకురాలు అనిత కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే పెళ్లి చేసుకున్న సాహెబ్ ‌రావుకి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. 60 వేల రూపాయల అప్పుకోసమే ఆ బాలికను తన కటుంబీకులు.. ఆ 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం