Uniform Civil Code: భయపడుతున్నారా.. భయపెడుతున్నారా.. రాజకీయ పార్టీలు కోరుకుంటున్నది ఇదేనా..

ఇవాళ దేశవ్యాప్తంగా చాలా మసీదుల్లో యూనిఫాం సివిల్ కోడ్‌‌కి వ్యతిరేకంగా చర్చ జరిగింది. ముస్లింలందరూ దాని వ్యతిరేకించి తన నిర్ణయాలని లా కమిషన్‌కు పంపించాలని మత పెద్దలు తీర్మానాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం..

Uniform Civil Code: భయపడుతున్నారా.. భయపెడుతున్నారా.. రాజకీయ పార్టీలు కోరుకుంటున్నది ఇదేనా..
Mosques
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 09, 2023 | 3:15 PM

హైదరాబాద్, జూలై 09: యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ముస్లింలు భయపడుతున్నారా..? రాజకీయ నాయకులు బయపెట్టిస్తున్నారా..? యూనిఫామ్ సివిల్ కోడ్ రాజకీయ అస్తరంగా వినియోగిస్తున్నారు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంశా పార్టీలు తమకు అనుకూలంగా మర్చుకుంటున్నాయా.. అసలు పార్టీల వ్యహం ఏంటి. ఇవాళ దేశవ్యాప్తంగా చాలా మసీదుల్లో యూనిఫాం సివిల్ కోడ్‌‌కి వ్యతిరేకంగా చర్చ జరిగింది. ముస్లింలందరూ దాని వ్యతిరేకించి తన నిర్ణయాలని లా కమిషన్‌కు పంపించాలని మత పెద్దలు తీర్మానాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం.. ముస్లిం మత పెద్దలు ఈ దేశంలో ముస్లింల గుర్తింపు ప్రమాదంలో పడిందని రాబోయే రోజుల్లో ముస్లింలకి కొత్త కొత్త చట్టాలతో ప్రభుత్వాలు వేధిస్తాయని అందుకే యూనిఫామ్స్ సివిల్ కోర్టును వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు కొంతమంది మత పెద్దలు మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్‌ డ్రాప్ ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాలేదు.. డ్రాప్ వచ్చిన తర్వాత స్పందిస్తామని చెప్పు చెప్తున్నారు.యూనిఫాం సివిల్ కోడ్‌ అంశం ప్రజల దృష్టిలో తీసుకెళ్లి ముస్లింల ఓటుని దోచుకొని రాజకీయంగా ఎదగడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రయత్నాలు చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో లాంటి మనదేశంలో వందలాది సంప్రదాయాలు వందలాది మత ఆచారాలు ఉన్నాయి. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదని యూనిఫామ్స్ సివిల్ కోడ్‌ ఫస్ట్ హిందువుల్లో ఇంప్లిమెంట్ చేయాలని మేధావులు కూడా సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రజల పైన ఇంప్రూవ్మెంట్ అవుతుందా రాజకీయ అస్త్రం గా ఉండి పోతుందా అనేది పెద్ద చర్చ జరుగుతుంది…

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అనేక మసీదుల దగ్గర యూనిఫామ్ సివిల్ కోడ్‌ని వ్యతిరేకిస్తూ ప్రత్యేకమైన పాంప్లెట్ విడుదల చేస్తూ ముస్లింలని అవేర్నెస్ చేస్తూ తన నిర్ణయాన్ని లా కమిషన్ పంపాలని మతపెద్దలు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం