కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏకంగా 378 మంది తహశీల్దార్‌లను…

కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తహశీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 378 మంది తహశీల్దార్లను  ట్రాన్స్‌ఫర్ చేసింది. జోన్‌ 5లో 166 మందిని, జోన్‌ 6లో 212 మందిని బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహశీల్దార్లు.. తిరిగి తమ స్థానాలకు బదిలీ చేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం […]

కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏకంగా 378 మంది తహశీల్దార్‌లను...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 18, 2019 | 3:52 AM

కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తహశీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 378 మంది తహశీల్దార్లను  ట్రాన్స్‌ఫర్ చేసింది. జోన్‌ 5లో 166 మందిని, జోన్‌ 6లో 212 మందిని బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహశీల్దార్లు.. తిరిగి తమ స్థానాలకు బదిలీ చేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే  తహశీల్దార్లను సొంత జిల్లాలకు రిలీవ్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దార్లు సోమవారమే జిల్లా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న బదిలీలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో.. తహశీల్దార్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. కాగా, మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.