AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

గతకొద్ది రోజులుగా దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు దేశానికి రెండో రాజధాని అనే ప్రతిపాదన లేనే లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చర్చ కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యా సాగర్ రావు హైదరాబాద్‌ దేశానికే రెండో రాజధాని కావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు […]

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 18, 2019 | 4:38 AM

Share

గతకొద్ది రోజులుగా దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు దేశానికి రెండో రాజధాని అనే ప్రతిపాదన లేనే లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చర్చ కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యా సాగర్ రావు హైదరాబాద్‌ దేశానికే రెండో రాజధాని కావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సోమవారం నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం సభ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు బిల్లులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఇక సోమవారం ప్రారంభమయ్యే సమావేశాల్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. విద్య, వైద్యం, నదుల అనుసంధానంపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని.. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగు నీరు, వైద్య సేవలు వంటి మౌలిక వసతుల కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

ఇక ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని.. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హామీ ఇవ్వలేదని.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామన్నారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు