AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘పుట్టనేమి! వాడు గిట్టనేమి..!’ నడివీధిలో అనాథగా ఓ తల్లి శవం! ఏ చెప్పుతో కొట్టాలి ఆ కొడుకుల్ని.. వీడియో

నవమాసాలు మోసి.. కని..పెంచిన కన్న తల్లి ఆఖరి మజిలీకి కూడా ముందుకు రాని కన్నకొడుకుల కథ ఇది. మీ తల్లి చనిపోయింది.. మృతదేహాన్ని తీసుకెళ్లండి అంటూ స్థానికులు‌ సమాచారం ఇచ్చినా.. మాకొద్దు ఆ మృతదేహం అంటూ కర్కషంగా వ్యవహారించి‌ కొడుకుల తీరిది. చివరికి కాలనీ వాసులే చందాలు‌ వేసుకుని ఆ తల్లికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్దమవగా.. ఆర్మీ‌జవాన్ గా విధులు నిర్వహిస్తున్న చిన్న కొడుకు..

Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 21, 2024 | 11:13 AM

Share

మంచిర్యాల, జూన్‌ 21: నవమాసాలు మోసి.. కని..పెంచిన కన్న తల్లి ఆఖరి మజిలీకి కూడా ముందుకు రాని కన్నకొడుకుల కథ ఇది. మీ తల్లి చనిపోయింది.. మృతదేహాన్ని తీసుకెళ్లండి అంటూ స్థానికులు‌ సమాచారం ఇచ్చినా.. మాకొద్దు ఆ మృతదేహం అంటూ కర్కషంగా వ్యవహారించి‌ కొడుకుల తీరిది. చివరికి కాలనీ వాసులే చందాలు‌ వేసుకుని ఆ తల్లికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్దమవగా.. ఆర్మీ‌జవాన్ గా విధులు నిర్వహిస్తున్న చిన్న కొడుకు ఎట్టకేలకు ముందుకు రావడంతో ఆ తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల‌‌ జిల్లా మందమర్రిలో చోటు‌చేసుకుంది.

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం పాత బస్టాండ్ ఏరియాలోని మున్సిపాలిటీ సమీపంలోని‌ రాంనగర్ కాలనీలో రాగంశెట్టి మల్లక్క ( 68 ) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది. మల్లక్కకు తిరుపతి, వెంకటేశ్, సురేష్ అనే ముగ్గురు కొడుకులు, ఓ కూతురు సంతానం. మల్లక్క భర్త మల్లేశం సింగరేణి కార్మికునిగా రిటైర్డ్ అయి.. నాలుగేళ్ల‌ క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.. చిన్న కొడుకు సురేష్ ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి మృతి తర్వాత తల్లిని గాలికొదిలేయడంతో ఒంటరిగా ఓ ఇంట్లో అద్దెకు‌ ఉంటోంది మల్లక్క. గురువారం ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది. ఇంటి యజమాని కొట్టే కొమురయ్య మల్లక్క మరణ సమాచారాన్ని కుమారులు తిరుపతి, వెంకటేష్, సురేష్ లకు తెలియజేశారు. ముగ్గురు కుమారులు తల్లి మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు.

కాలనీ‌వాసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన మల్లక్క కుటుంబ సభ్యులెవరు ముందుకు రాలేదు. చేసేది లేక కాలనీవాసులే చందాలు వేసుకుని అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన‌ చిన్న కొడుకు సురేష్ అతికష్టమ్మీద తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కన్నతల్లి మరణించినా కుమారులు, కుటుంబ సభ్యులు మల్లక్క అంత్యక్రియలకు ముందుకు రాకపోవడం స్థానికులను కలచివేసింది. బతికినంత కాలం కొడుకులను బంగారం లెక్క చూసుకుంటే కనీసం చివరి చూపుకు కూడా నోచుకోలేని దుస్థితి ఆ తల్లికి ఎదురైందని.. నవ మాసాలు‌ మోసిన తల్లిని ఆఖరి‌రోజుల్లో అనాథను చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.