AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ.. కొత్తగా 17000 ఐటీ ఉద్యోగాలు

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ లిమిటెడ్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నాయి. తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ జయేశ్ సంగ్రాజ్కా మధ్య జరిగిన సమావేశం లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు

Telangana: హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ.. కొత్తగా 17000 ఐటీ ఉద్యోగాలు
Infosys
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 23, 2025 | 12:58 PM

Share

హైదరాబాద్‌లోని పోచారం ఐటీ క్యాంపస్‌లో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను విస్తరించనుంది. ప్రస్తుతానికి 35,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ క్యాంపస్, కొత్తగా 17,000 ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఫేజ్ 1లో రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణం వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి కానుంది మరియు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

తెలంగాణ ఐటీ రంగానికి ఊతం

ఈ విస్తరణ రాష్ట్రంలోని ఐటీ రంగానికి గణనీయమైన ప్రయోజనాలు అందించనుంది. తెలంగాణ ఐటీ రంగం దేశంలోనే ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తూ, ఈ భాగస్వామ్యం ఐటీ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనుంది.

ఇన్ఫోసిస్ సీఏఫ్ఓ జయేశ్ సంగ్రాజ్కా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం ఆవిష్కరణ, ఐటీ రంగ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో మా ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి మాట్లాడుతూ, మేం ప్రతిభను పెంపొందించడం, అవకాశాలను సృష్టించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ కృషి

ఈ ఒప్పందం మరోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రోఆక్టివ్ దృక్పథాన్ని ఐటీ రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహకతను నిరూపించింది. ఇన్ఫోసిస్ విస్తరణ తెలంగాణను ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లనుంది.

Infosys

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.