Hyderabad: అంబర్‌పేటలో దారుణం.. ఇద్దరిపై కత్తితో దాడి చేసిన బాలుడి ఆత్మహత్య
పుట్టిన రోజు నాడే తీవ్ర విషాదం. హైదరాబాద్‌లోని విద్యానగర్ - జామై ఉస్మానియా స్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఓ బాలుడు రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి విద్యానగర్- జామియా ఉస్మానియా స్టేషన్ల మధ్య బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. మృతి చెందిన బాలుడు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని యువతిపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 19: పుట్టిన రోజు నాడే తీవ్ర విషాదం. హైదరాబాద్‌లోని విద్యానగర్ – జామై ఉస్మానియా స్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఓ బాలుడు రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి విద్యానగర్- జామియా ఉస్మానియా స్టేషన్ల మధ్య బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. మృతి చెందిన బాలుడు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని యువతిపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిపారు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో ఒక బాలికను వేధిస్తున్నాడు. ఫోన్లో మెసేజ్ చేయడమే కాకుండా తరచూ వెంటపడి వేధించేవాడని తెలిసింది. బాధితురాలు ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ట్యూషన్‌కు వెళ్లిన ఆమెను కత్తితో దాడిచేసి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగడంతో ఈస్ట్ జోన్ డీసీపీ సాయిశ్రీ కీలక అంశాలను వెల్లడించారు.
ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో ఉండే బాధిత బాలిక, మృతి చెందిన బాలుడు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుకున్నారు. బాలిక తల్లి స్థానికంగా టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఆమె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. టైలరింగ్ సామగ్రిని బాలుడి కుటుంబీకులు కొనుగోలు చేశారు. తన పెద్దమ్మ కూతురు వద్దకు బాధితురాలు ప్రతిరోజు ట్యూషన్ కు వెళ్తుంది. ఈక్రమంలోనే గురువారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న సమయంలో వెంటపడి వేధింపులకు గురిచేశారు. ఈమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈదే రోజు రాత్రి 7.30 సమయంలో ట్యూషన్‌లోకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను కత్తితో పొడిచాడు. అడ్డొచ్చిన ఆమె పెద్దమ్మ కూతురును కూడా పొడిచి గాయపర్చాడు. కత్తిని అక్కడే పడేసి పారిపోయాడు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హుఠాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కత్తిపోట్లకు గురైన ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోల్కున్నారు. అయితే వారిపై దాడికి పాల్పడిన సమయంలో రక్తాన్ని చూసి భయంతో బాలుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..