Gujrat: గుజరాత్‎లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విహారం.. పడవ బోల్తా 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి..

గుజరాత్ వడోదర శివార్లలోని హర్ని సరస్సులో గురువారం పడవ బోల్తా పడటంతో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు. బోటులో 27 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు విహార యాత్రకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Gujrat: గుజరాత్‎లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విహారం.. పడవ బోల్తా 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి..
Gujrat Boat Accident
Follow us
Srikar T

|

Updated on: Jan 19, 2024 | 9:28 AM

వడోదర, జనవరి 19: గుజరాత్ వడోదర శివార్లలోని హర్ని సరస్సులో గురువారం పడవ బోల్తా పడటంతో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు. బోటులో 27 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు విహార యాత్రకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం కీలక ప్రకటన వెలువరించింది. మరణించిన బాధిత కుటుంబాలకు 2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 50వేల పీఎం సహాయనిధి అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ తెలిపారు. గంటలపాటు తీవ్రంగా శ్రమిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది.

విహారయాత్రకు వెళ్ళిన పాఠశాల విద్యార్థులు సిబ్బంది గురువారం మధ్యాహ్నం పడవ బోల్తా పడటంతో నీటిలో పడిపోయారు. ఇప్పటి వరకూ ఏడుగురిని బయటకు వెలికి తీసి ప్రాణాలను కాపాడారు. మరి కొందరి కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానిక చేరుకునే లోపే కొందరు స్థానికులు నీటిలో చిక్కుకున్న పిల్లలను రక్షించారు. నీటి నుంచి బయటకు తీసిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులను ఎక్కించడంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని వడోదర ఎంపీ ధనంజయ్ భట్ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను ముఖ్యమంత్రి ఓదార్చారు. వారిలో ధైర్యం నింపారు. చిన్నారులు ప్రయాణిస్తున్ పడవ బోల్తా పడటం చాలా బాధాకరమన్నారు. అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. విషాదం చోటు చేసుకున్న కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి సాయమైనా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..