Telangana: కేబుల్, సెల్ రీచార్జ్ కోసం డబ్బులు ఇవ్వని తల్లి.. క్షణికావేశంలో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

|

Mar 30, 2023 | 9:28 AM

యశోద కొడుకును మందలించింది. 'చదువు గురించి పట్టించుకోవు గానీ ఇలాంటివి మాత్రం కావాలి' అని అంది. ఆ తర్వాత 'నువ్వు చిన్న పిల్లాడివి. నీకేం తెలుసు. నేను రీచార్జ్ చేయిస్తా..' అని చెప్పి ఎద్దుల జాడ కోసం బయటకు వెళ్లింది.

Telangana: కేబుల్, సెల్ రీచార్జ్ కోసం డబ్బులు ఇవ్వని తల్లి.. క్షణికావేశంలో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
Telangana News
Follow us on

కేబుల్ టీవీ, సెల్ఫోన్ రీచార్జ్ చేయించమని అడిగినందుకు కొడుకును తల్లి మందలించింది. చదువుకునే వాడికి అవెందుకు అంది. దీంతో అతడు మనస్తాపం చెందాడు. క్షణికావేశంతో ఉరి వేసుకొ ని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దులపల్లికి చెందిన గోగు అర్జయ్య, యశోద దంపతులకు కూతురు. శరణ్య, కుమారుడు తరుణ్(12) సంతానం. మూడేళ్ల క్రితం అర్జయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలను యశోద కూలినాలి చేసి పోషించుకుంటోంది.

శరణ్య చిట్యాల గురుకులంలో తొమ్మిదో తరగతిలో ఉండగా, తరుణ్ సుందర్రాజ్ పేట జడ్పీహెచ్ఎస్లో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తరణ్ సెల్ఫోన్, కేబుల్ టీవీ రీచార్జ్ కోసం తల్లిని డబ్బులు అడిగాడు. దీంతో యశోద కొడుకును మందలించింది. ‘చదువు గురించి పట్టించుకోవు గానీ ఇలాంటివి మాత్రం కావాలి’ అని అంది. ఆ తర్వాత ‘నువ్వు చిన్న పిల్లాడివి. నీకేం తెలుసు. నేను రీచార్జ్ చేయిస్తా..’ అని చెప్పి ఎద్దుల జాడ కోసం బయటకు వెళ్లింది.

ఈ క్రమంలో తరుణ్ ఆవేశంగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి బయటకు రావాలని కోరారు. ఎంతకీ బయటికి రాకపోవడంతో తలుపులు పగుల గొట్టి లోపలికి వెళ్లి చూడగా తరుణ్ ఉరి వేసుకుని ఉన్నాడు. కిందకి దించి ఆస్ప త్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు. క్షణికావే శంలో 12 ఏళ్ల బాలుడు తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి లేకపోయినా రెక్కలు ముక్కలు చేసి పిల్లలను పోషిం చుకుంటున్న తనకు ఈ పరిస్థితి రావడమేమిటని యశోద విలపిస్తోంది.

ఇవి కూడా చదవండి

 

Reporter: Peddesh, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..