AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: కడుపులో నొప్పిగా ఉందంటూ ఫ్రెండ్‌కి మెసేజ్ చేసిన 10వ తరగతి బాలిక.. వచ్చేలోపే

విశాఖలో పదిహేనేళ్ల బాలిక.. ఉన్నట్టుండి అపార్ట్‌మెంట్ పైకి వెళ్లింది.. ఏమైందో ఏమో కానీ భవనంపై నుంచి దూకేసింది.. కళ్లద్దాలు, మొబైల్ ఫోన్.. చేతికున్న బ్రాస్లెట్ పక్కనపెట్టి.. ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు స్నేహితురాలికి ఇంటికి రావాలని కోరింది.. అనారోగ్యంతో కడుపునొప్పి తీవ్రంగా ఉందని చెప్పింది.. స్నేహితురాలు వచ్చేలోపే..

Vizag: కడుపులో నొప్పిగా ఉందంటూ ఫ్రెండ్‌కి మెసేజ్ చేసిన 10వ తరగతి బాలిక.. వచ్చేలోపే
Vizag Police
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 19, 2025 | 11:33 AM

Share

విశాఖ అక్కయ్యపాలెంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్జీవోస్ కాలనీలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివాసం ఉంటుంది బాలిక. సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే అనారోగ్యం కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లోనే స్కూల్ మాన్పించారు తల్లిదండ్రులు. ఏమైందో ఏమో కానీ మంగళవారం నాడు తన కడుపు నొప్పి తీవ్రంగా వస్తుందని కుటుంబ సభ్యులకి చెప్పింది. నొప్పి తగ్గేందుకు డాక్టర్లు ఇచ్చిన కొన్ని లిక్విడ్స్ ఇచ్చారు పేరెంట్స్. అయినా పెయిన్ తగ్గకపోవడంతో.. తన స్నేహితురాలికి మెసేజ్ పంపింది బాలిక. మాట్లాడేందుకు ఇంటికి రావాలని కోరింది. ఆమె వచ్చేలోపే బాలిక అపార్ట్‌మెంట్ భవనం పైకి ఎక్కి దూకేసింది. భారీ శబ్దం రావడంతో చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉంది బాలిక. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులని విచారించారు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిన చిన్న కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు