AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Call Apps: వాట్సాప్ Vs గూగుల్ మీట్ Vs జూమ్: వీడియో కాలింగ్ కోసం ఏ యాప్ బెటర్? ఇలా తెలుసుకోండి..!

Video Call Apps: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మనుషులు భౌతిక దూరం పాటించడం పరిపాటి అయ్యింది. ఆ కారణంగా చాలా..

Video Call Apps: వాట్సాప్ Vs గూగుల్ మీట్ Vs జూమ్: వీడియో కాలింగ్ కోసం ఏ యాప్ బెటర్? ఇలా తెలుసుకోండి..!
Shiva Prajapati
|

Updated on: Mar 06, 2021 | 5:33 AM

Share

Video Call Apps: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మనుషులు భౌతిక దూరం పాటించడం పరిపాటి అయ్యింది. ఆ కారణంగా చాలా మంది ఇతరులతో మాట్లాడాలన్నా, సమావేశాలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా వీడియో కాల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రజలు కార్యాలయ సమావేశాలకు హాజరుకావడానికి, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి, మరెన్నో అంశాల్లో వీడియో కాలింగ్ యాప్స్‌ని ఉపయోగించడం అనివార్యమైంది. ఈ వీడియో కాల్స్ కోసం జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ వంటి యాప్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే వాట్సప్ తన యూజర్ల కోసం డెస్క్ టాప్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. వాయిస్, వీడియో కాల్‌కు అనుకూలంగా డెస్క్‌టాప్ వాట్సప్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పటివరకు వాట్సప్ మొబైల్ వెర్షన్‌కు మాత్రమే వీడియోకాల్స్, ఆడియో కాల్స్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ద్వారా కూడా వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేసుకునేలా మార్పులు చేసింది. అయితే, ఈ ఆప్షన్‌ను వినియోగించాలంటే.. వెబ్‌క్యామ్, మైక్రోఫోన్ అవసరం. భద్రత, గోప్యతకు సంబంధించి.. చాట్ మాదిరిగానే డెస్క్‌టాప్ వెర్షన్‌లో వీడియో, వాయిస్ కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ వాటిని వినదు, చూడదు అని తేల్చి చెప్పింది. వాట్సప్‌తో పాటు మార్కెట్‌లో గూగుల్ మీట్, జూమ్‌ వంటి యాప్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ యాప్స్‌లో తేడా ఏంటి, ఆ ఫీచర్లలో తేడా ఏంటి? ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం.

వాట్సాప్ Vs గూగుల్ మీట్ Vs జూమ్ డెస్క్‌టాప్ యాప్ వెర్షన్ కోసం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వాయిస్, వీడియో కాల్‌లను ప్రకటించింది. ఇప్పుడు వినియోగదారులు ఫోన్‌లో కాల్ చేసే సౌలభ్యం వెబ్ వెర్షన్‌లో కూడా ఆస్వాదించవచ్చు. కోవిడ్ సంక్షోభ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం చాలా మంది ఉపయోగించిన సాధనాలలో జూమ్‌ని ప్రముఖంగా చెప్పవచ్చు. ఈ యాప్‌ చాలా సులభంగా పని చేస్తుంది. బిజినెస్ పర్పస్‌లో అయినా, పాఠశాల కోసం అయినా, సన్నిహితులతో అయినా ఏ విధంగా అయినా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి జూమ్‌లో అవకాశం ఉంది. దాంతో జూమ్ మరింత ప్రాచూర్యం పొందింది. అయితే, ఈ యాప్ భద్రత, గోప్యతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. ఇది అంత సురక్షితం కాదని చాలా మంది వాదించారు. జూమ్ వినియోగదారుల డేటా ఫేస్‌బుక్‌కు అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో, గూగుల్ తన హ్యాంగ్అవుట్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ హ్యాంగ్అవుట్ వినియోగదారులకు పెద్ద ఊరటగా మారింది. జూమ్, వాట్సాప్ లకు పోటీ ఇస్తూ నిలిచింది.

వాట్సాప్ వీడియో కాల్ వాట్సాప్‌ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారుల వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ ఫోన్ కమ్యూనికేషన్ సేవ. ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫాం. యూజర్ల గోప్యతకు ప్రియారిటీ ఇస్తుంది. వాట్సాప్ సులభమైన మొబైల్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందిస్తుంది. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయడానికి అవకాశం ఉంది. వాట్సప్‌లో వీడియో కాల్ చేయడం కోసం ముందుగా కాల్ చేయదలిచిన వ్యక్తి పేరు ఎంచుకుని కాల్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత కెమెరా చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా వీడియో కాల్‌ను కనెక్ట్ చేయవచ్చు.

జూమ్ వీడియో కాల్ జూమ్ ఇది వెబ్ ఇంటిగ్రేషన్, విశ్వసనీయత, అనేక ఇతర లక్షణాల కారణంగా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన వాణిజ్య వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమాల్లో ఒకటి. దీనిని మొబైల్, వెబ్ వెర్షణ్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదేమైనా, ఈ మాధ్యమం ఇటీవలి కాలంలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు.. వినియోగదారుల సున్నితమైన డేటా ఇంటర్నెట్‌లో లీక్ చేయబడిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

గూగుల్ మీట్ వీడియో కాల్ గూగుల్ ఇటీవల తన హ్యాంగ్‌అవుట్ మాధ్యమాన్ని చాట్, వీడియో కాల్‌గా విభజించింది. ఇది ఫీచర్ గూగుల్ అనువర్తనాలలో అంతర్నిర్మితంగా వస్తుంది. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ వాయిస్ ఇతరాలు. గూగుల్ మీట్‌ను డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లైన సఫారి, క్రోమ్, మొజిల్లా, ఎడ్జ్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ మాధ్యమం ద్వారా 100 మందికి పైగా పాల్గొనే వారితో 24 గంటల కాలపరిమితితో సమావేశాలను హోస్ట్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది.

Also read:

Summer Effect: ఇవి మామూలు కోతులు కాదండోయ్.. భక్తుల కోసం ఏర్పాటు చేస్తే వానర సేన వచ్చి ఏం చేసిందంటే..

ACB Caught Sarpanch: కాంప్లెక్స్ నిర్మాణాన్ని అడ్డుకున్నాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు.. ఓ సర్పంచ్ కథలు ఇవి..!