AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pant Zip: జీన్స్‌ ప్యాంట్ల జిప్‌లపై ఈ అక్షరాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల దుస్తులను చూస్తుంటాము. ప్రతి బట్టలపై ఏదో ఒక గుర్తు ఉంటుంది. దుస్తులపై కంపెనీ నేమ్‌లతో కూడిన ఓ లోగోతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి...

Pant Zip: జీన్స్‌ ప్యాంట్ల జిప్‌లపై ఈ అక్షరాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?
Pant Zip
Subhash Goud
|

Updated on: Oct 30, 2022 | 6:00 AM

Share

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల దుస్తులను చూస్తుంటాము. ప్రతి బట్టలపై ఏదో ఒక గుర్తు ఉంటుంది. దుస్తులపై కంపెనీ నేమ్‌లతో కూడిన ఓ లోగోతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఇక ప్యాంట్లకు జిప్స్‌ను గమనించి ఉంటారు. అయితే ప్యాంట్‌కు ఉండే జిప్‌పై పలు అక్షరాలతో కూడిన గుర్తులు మీరు గమనించి ఉంటారు. ప్యాంటు జిప్‌పై YKK అనే అక్షరాలు మీరెప్పుడైనా గమనించారా..? ఒక వేళ గమనించినా ఈ వైకేకే అక్షరాలు ఎందుకు ఉంటాయోనని పెద్దగా పట్టించుకోరు. ఆ వైకేకే అక్షరాలు ఉండటం వెనుక కారణం కూడా ఉంది.

YKK అంటే ‘యొషిదా కొంగ్యో కుబుషికిగైషా (యోషిదా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌)’ ఈ పేరు పలకడం కొంత కష్టంగా ఉంటుంది. జపాన్‌కు చెందిన టాడావో యోషిదా 1934లో దీనిని స్థాపించారు. 71 దేశాల్లో 109 యూనిట్లు కలిగి ఉన్న ఈ సంస్థ నుంచే ప్రపంచవ్యాప్తంగా 90శాతం జిప్‌లు ఉత్పత్తి అవుతున్నాయట. ఈ కంపెనీ కేవలం జిప్పర్స్‌నే కాదు.. జిప్‌లను తయారు చేసే యంత్రాలను సైతం తయారు చేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం.. జార్జియాలో YKKకి రోజుకి 70 లక్షలకుపైగా జిప్‌లు తయారు చేసే అతిపెద్ద కంపెనీగా పేరొందింది. 1966లో ప్రస్తుతం జీన్స్‌ ప్యాంట్లకు ఉండే Y జిప్‌లను ఈ సంస్థే ఆవిష్కరించింది. ప్యాంటును కుట్టే మెషీన్‌లోనే ఈ జిప్‌ను కుట్టే పరికరాన్నీ అమర్చడంతో జీన్స్‌ ఉత్పత్తి, అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

1968లో జపాన్‌ దాటి కెనడాలో తొలిసారి YKK తన సంస్థను ఏర్పాటు చేసింది. కంపెనీ మంచి నాణ్యతతో కూడిన జిప్‌లను తయారు చేస్తుండటంతో మంచి ఆదరణ పెరిగింది. అనేక దేశాల్లో ఈ జిప్‌ కంపెనీ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంది. ఈ సంస్థకు చాలా కాలం పాటు పోటీనే లేదు. ప్రస్తుతం ఈ కంపెనీకి పోటీగా పలు కంపెనీలు వచ్చినా.. ఇప్పటికి జీన్స్‌ ప్యాంట్ల జిప్‌లకు ప్రత్యేక స్థానముంది. జీన్స్‌ ప్యాంట్లపై జిప్‌లతో పాటు ఇతర దుస్తులు, బ్యాగులకు సంబంధించిన వస్తువులను తయారు చేస్తోంది ఈ కంపెనీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి