- Telugu News Photo Gallery Technology photos These are the mistakes made smartphone lifespan decline Telugu Tech News
Smartphone Tips: మీరు తెలిసి చేసే ఈ తప్పులే.. మీ స్మార్ట్ ఫోన్ పాడై పోవడానికి కారణాలు..
స్మార్ట్‌ఫోన్‌ను మనం ఎలా ఉపయోగిస్తామన్న దానిపైనే దాని లైఫ్ టైమ్ ఆధారపడి ఉంటుంది. అయితే మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులే స్మార్ట్‌ఫోన్ పనితీరు దెబ్బ తినేలా చేస్తాయి. ఇంతకీ ఆ తప్పులేంటంటే..
Updated on: Oct 29, 2022 | 7:44 PM

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కాసేపు కనిపించకపోతే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్ పనితీరు మనం ఫోన్‌ను ఉపయోగించే విధానంపైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.?

స్మార్ట్ ఫోన్ పనితీరు త్వరగా దెబ్బతినడానికి ఎక్కువ యాప్‌లను ఉపయోగించడం ఒక కారణం. ఫోన్‌లో అనవసరమైన యాప్‌లను ఎక్కువగా డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ వేగం నెమ్మదిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం వాడుతూ ఎప్పుడూ ఛార్జింగ్ పెడుతుంటే బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. బ్యాటరీ వేడెక్కడం వల్ల ఫోన్ పనితీరు దెబ్బ తింటుంది. దీనివల్ల మదర్ బోర్డ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేసే సమయంలో కొందరు ఇష్టానుసారంగా సరైన సాధనాలను ఉపయోగించకుండా క్లీన్ చేస్తుంటారు. దీనివల్ల ఫోన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మనలో చాలా మంది ఫోన్‌లను తక్కువ నాణ్యతో కూడిన చార్జర్లను చార్జ్ చేస్తుంటారు. దీనివల్ల కూడా స్మార్ట్ ఫోన్ పనితీరు దెబ్బతింటుంది. బ్యాటరీపై పడే ప్రభావంతో ఫోన్‌లోని ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బ తింటాయి.




