SBI Account Statement: ఇంటర్‌నెట్ లేకుండానే బ్యాంకు స్టేట్‌మెంట్.. ఇంట్లో నుంచే చాలా ఈజీగా పొందొచ్చు..
దేశంలోని అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇంటర్ నెట్ పని లేకుండానే.. బ్యాంకుకు అసలు వెళ్లకుండానే బ్యాంకు స్టేట్మెంట్ పొందే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఓ చిన్న ఫోన్ కాల్ తోనే మీ అకౌంట్ స్టేట్ మెంట్ ఏకంగా మీ ఫోన్లోకే వచ్చేస్తుంది.

దేశంలో అతి తక్కువ కాలంలో అద్భుతమైన ప్రగతి సాధించిన రంగం ఏదైనా ఉందంటే అది బ్యాంకింగ్ రంగం అనే చెప్పాలి. ఒకప్పుడు డబ్బులు తీయాలన్నా.. వేయాలన్నా ఎంత ప్రయాస ఉండేదో కదా? కాల క్రమేణా అందివచ్చిన సాంకేతికత మనిషికి పనిని సులభతరం చేసింది. డిజిటలీకరణ మనిషికి మరింత సౌఖ్యాన్ని అందించింది. అన్ని ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు అద్భుతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు ఉత్తమ ఫీచర్లతో కూడిన యాప్ లను ప్రవేశపెట్టాయి. దాని నుంచి ఎలాంటి లావాదేవీనైనా చేసే వీలుంటుంది. అకౌంట్ స్టేట్ మెంట్ కూడా యాప్ నుంచే పొందొచ్చు. అయితే దేశంలోని అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇంటర్ నెట్ పని లేకుండానే.. బ్యాంకుకు అసలు వెళ్లకుండానే బ్యాంకు స్టేట్మెంట్ పొందే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఓ చిన్న ఫోన్ కాల్ తోనే మీ అకౌంట్ స్టేట్ మెంట్ ఏకంగా మీ ఫోన్లోకే వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫోన్ కాల్ చాలు..
మీ ఖాతా స్టేట్‌మెంట్ ను మీరు ఇంట్లో కూర్చొని పొందవచ్చు. దీని కోసం, బ్యాంక్ కొన్ని నంబర్‌లను అందించింది. మీరు అభ్యర్థనను నమోదు చేయడానికి కాల్ చేయాల్సి ఉంటుంది. మీరు అభ్యర్థనను లేవనెత్తిన వెంటనే ఖాతా స్టేట్‌మెంట్ ఈ మెయిల్ ద్వారా మీ మొబైల్ ఫోన్ వచ్చేస్తుంది. అందుకోసం మీరు చేయాల్సిందేమిటంటే..
మీ ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్‌కు కాల్ చేస్తే చాలు మీ స్టేట్ మెంట్ క్షణాల్లో మీ ఫోన్లో ఉంటుంది. ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్ టోల్-ఫ్రీ నంబర్లు1800 1234 లేదా 1800 2100. వీటికి కాల్ చేసిన తర్వాత, ఐవీఆర్ సూచనల మేరకు ఖాతా బ్యాలెన్స్, లావాదేవీ వివరాలను పొందడానికి 1 నొక్కాలి. ఆ తర్వాత, మీ బ్యాంక్ ఖాతా నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి. తదుపరి దశలో, ఖాతా స్టేట్‌మెంట్‌ను పొందడానికి 2ను నొక్కాలి, ఆ తర్వాత కస్టమర్ స్టేట్‌మెంట్ డేట్ ను ఎంచుకోమని అడుగుతుంది. వినియోగదారుకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకూ స్టేట్‌మెంట్ కావాలో ఎంటర్ చేయగానే అది బ్యాంక్ ద్వారా వినియోగదారు ఈ మెయిల్ ఐడీకి వచ్చేస్తుంది.



డిజిటల్ దూకుడు..
డిజిటలైజేషన్ ప్రభావం గత పదేళ్లలో బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. డిజిటల్ విప్లవం ఫలితంగా కస్టమర్లు తమ బ్యాంకులతో చేసే లావాదేవీల విధానం మారింది. అలాగే బ్యాంకులు తమ వ్యాపారాలను నిర్వహించే విధానం కూడా మారింది. ఇంతకుముందు, బ్యాంకింగ్ కోసం సంప్రదాయ బ్యాంకులు మాత్రమే నమ్మదగిన ఎంపిక. అయితే, నేడు డిజిటల్ ఆధారిత ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐ, నియో బ్యాంకుల వంటివి కూడా ఆర్థిక సేవలను సురక్షితంగా అందిస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..