Whatsapp: మీ వాట్సాప్‎ను ఒకేసారి రెండు వేరే ఫోన్‎ల నుంచి వాడచ్చు.. ఇదిగో వివరాలు

సాధారణంగా వాట్స్అప్ బిజినెస్ వచ్చిన తర్వాత ఒకే ఫోన్లో రెండు వాట్సప్ అకౌంట్లు వినియోగించడం చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఓకే వాట్సాప్ నంబర్‌తో రెండు ఫోన్లలోనూ వాడటం ఎలా?. ఇలా చేయడానికి రెండు స్టెప్స్ పాటిస్తే చాలు.

Whatsapp: మీ వాట్సాప్‎ను ఒకేసారి రెండు వేరే ఫోన్‎ల నుంచి వాడచ్చు.. ఇదిగో వివరాలు
Whatsapp

Edited By: Aravind B

Updated on: Jul 24, 2023 | 1:51 PM

సాధారణంగా వాట్స్అప్ బిజినెస్ వచ్చిన తర్వాత ఒకే ఫోన్లో రెండు వాట్సప్ అకౌంట్లు వినియోగించడం చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఓకే వాట్సాప్ నంబర్‌తో రెండు ఫోన్లలోనూ వాడటం ఎలా?. ఇలా చేయడానికి రెండు స్టెప్స్ పాటిస్తే చాలు. మీరు ఒకే నంబర్‎ను రెండు ఫోన్‎లలోనూ వాడుకోవచ్చు. రెండు ఫోన్‎లకు వాట్సాప్ మెసేజ్‎లు వస్తాయి.మన పాత ఫోన్ నుండి కొత్త ఫోన్ మార్చినపుడు బ్యాక్ అప్ లేకుండానే మన మెసేజ్‎లు అన్ని ఇంకో ఫోన్ లో ప్రత్యక్షం అవుతాయి. ఇది చాలా సింపుల్ విధానం. మొదట మనం పాత ఫోన్ లో వాడిన వాట్సాప్ అకౌంట్‎ను ఓపెన్ చేయాలి. మరో వైపు కొత్త మొబైల్‎లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి రెడీగా పెట్టుకోవాలి.

ఇప్పుడు పాత ఫోన్ లోని వాట్సాప్ నుండి సెట్టింగ్స్ కి వెళ్లి linked device అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి…అలాగే కొత్త ఫోన్‎లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో link your old device అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు మీరు రెండు అకౌంట్ లలోనూ ఓకే వాట్సాప్ నంబర్ ను వాడుకోవచ్చు. పాత మొబైల్‏లో ఉన్న క్యూ ఆర్ కోడ్‎ను కొత్త మొబైల్‎లో ఉన్న వాట్సాప్‎కు స్కాన్ చేస్తే చాలు, మీరు సక్సెస్ అయినట్టే. రెండు మొబైల్స్‎లోనూ ఓకే నంబర్ తో వాట్సాప్ వాడుకోవచ్చు. మామూలుగా మనం కొత్త ఫోన్ రాగానే అందులో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు పాత నంబర్‎లో వాట్సాప్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. మనం కొత్త ఫోన్ లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి OTP కొట్టిన వెంటనే కేవలం కొత్త మొబైల్‎లో మాత్రమే ఒక వాట్సాప్ నంబర్ యాక్షన్‎లో ఉంటుంది. కానీ ఈ విధంగా చేస్తే ఓకేసారి రెండు మొబైల్ ఫోన్‎లలో ఓకే వాట్సాప్ నంబర్ అకౌంట్ మెయింటైన్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి