AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi: షావోమీ యూజర్లకు బంపరాఫర్‌.. ఉచితంగా యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. కానీ..

Xiaomi: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. పోటీపడీ మరీ కంపెనీలు తమ బ్రాండ్స్‌ను ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి...

Xiaomi: షావోమీ యూజర్లకు బంపరాఫర్‌.. ఉచితంగా యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. కానీ..
Narender Vaitla
|

Updated on: Jun 09, 2022 | 6:49 AM

Share

Xiaomi: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. పోటీపడీ మరీ కంపెనీలు తమ బ్రాండ్స్‌ను ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. యూట్యూబ్‌తో కలిసి యూజర్లకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

ఎంపిక చేసిన కొన్ని షావోమీ బ్రాండ్స్‌పై దేశీయంగా యూట్యూబ్‌ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. మొదటి మూడు నెలలు యూజర్లకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ అందించనున్నారు. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ ఫోన్లపై మొదటి మూడు నెలలు, రెడ్‌మి నోట్‌ 11, నోట్‌ 11 ఎస్‌ వాటిపై రెండు నెలల సబ్‌స్ర్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్‌ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కోసం యూజర్లు ప్రస్తుతం నెలకు రూ. 129 చెల్లించాల్సి ఉంది.

యూట్యూబ్‌ ప్రీమియం ద్వారా లభించే ప్రత్యేక ఫీచర్లు ఇవే..

ఇవి కూడా చదవండి

* ప్రీమియమ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం యూట్యూబ్‌ ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తోంది. వెబ్‌ సిరీస్‌లు, షోలతో పాటు ప్రత్యేకమైన ఒరిజినల్‌ ఉంటాయి.

* యూబ్యూట్‌ ప్రీమియం తీసుకున్న వారు యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసుకోవచ్చు.

* యూట్యూబ్‌ యాప్‌ నుంచి బయటకి వచ్చినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో వినొచ్చు. అంతేకాకుండా డిస్‌ప్లేపై పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌లో వీడియోలను చూసుకోవచ్చు.

* యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఉచితంగా పొందొచ్చు. అలాగే ప్రీమియం తీసుకున్న వారు ఆఫ్‌లైన్‌లో వీడియోలను 720P, 1080P వంటి హైరెజల్యూన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆట ఎలా ఆడాలో నేర్పిస్తున్న త్రిగుణ్.. బాబోయ్ బిల్డప్ మాములుగా లేద
ఆట ఎలా ఆడాలో నేర్పిస్తున్న త్రిగుణ్.. బాబోయ్ బిల్డప్ మాములుగా లేద
మరి కొద్దీ రోజుల్లో వీరి దశ మార్చనున్న శని
మరి కొద్దీ రోజుల్లో వీరి దశ మార్చనున్న శని
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
హువాయి ఫ్రీబడ్స్‌ 7 టెక్నాలజీ, ఫీచర్లు తెలుసా
హువాయి ఫ్రీబడ్స్‌ 7 టెక్నాలజీ, ఫీచర్లు తెలుసా
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు.. శనివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు.. శనివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ షేకవుతుందా
వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ షేకవుతుందా
17 బంతుల్లో జీరో.. టీ20 హిస్టరీకే దడ పుట్టించిన డేంజరస్ ప్లేయర్
17 బంతుల్లో జీరో.. టీ20 హిస్టరీకే దడ పుట్టించిన డేంజరస్ ప్లేయర్
యాపిల్ ప్రేమికులకు ఊహించని ట్రీట్.. మార్కెట్లోకి కొత్త ఐఫోన్
యాపిల్ ప్రేమికులకు ఊహించని ట్రీట్.. మార్కెట్లోకి కొత్త ఐఫోన్
తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో యాపిల్ ఎయిర్‌‌పాడ్స్‌
తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో యాపిల్ ఎయిర్‌‌పాడ్స్‌
ట్రాఫిక్ ఫైన్​ పేరుతో ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్‌‌ కేటుగాళ్లు
ట్రాఫిక్ ఫైన్​ పేరుతో ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్‌‌ కేటుగాళ్లు