AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Images: గూగుల్‌లో మీకు కావాల్సిన ఫోటోలు దొరకడం లేదా.? ఇలా ట్రై చేసి చూడండి..!

Google Images: ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా ప్రతీది ఆన్‌లైన్‌లోనే దొరికిపోతుంది. ఏది ఆవాలన్నా గూగుల్ ఉండనే ఉంది. వివిధ రకాల సమాచారం గూగుల్‌లో..

Google Images: గూగుల్‌లో మీకు కావాల్సిన ఫోటోలు దొరకడం లేదా.? ఇలా ట్రై చేసి చూడండి..!
Subhash Goud
| Edited By: |

Updated on: Jun 07, 2022 | 6:34 AM

Share

Google Images: ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా ప్రతీది ఆన్‌లైన్‌లోనే దొరికిపోతుంది. ఏది ఆవాలన్నా గూగుల్ ఉండనే ఉంది. వివిధ రకాల సమాచారం గూగుల్‌లో సెర్చ్‌ (Google Search) చేసి క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో చాలా మంది తమకు కావాల్సిన ఇమేజెస్ దొరకడం లేదని ఫీలవుతుంటారు. అటువంటి, వారి కోసం కొన్ని కొత్త పద్దతులను పరిచయం చేస్తోంది గూగుల్. వీటిని అనుసరించడం ద్వారా యూజర్లు తమకు కావాల్సిన ఇమేజ్‌ను హై క్వాలిటీలో డౌన్​లోడ్​చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. గూగుల్‌ సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని ఇమేజెస్ కనబడుతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇమేజెస్ దొరకనప్పుడు గూగుల్ అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మీరు క్వాలిటీ ఇమేజెస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు మీ డెస్క్ టాప్ లేదా ఫోన్ లేదా ఇతర ఏ డివైజెస్‌లోనైనా గూగుల్​ఇమేజ్ సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

☛ బ్రౌజర్‌లో https://images.google.com/ అని టైప్ చేయండి.

☛ వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమవైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

☛ ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి లేదా అప్‌లోడ్ యాన్ ఇమేజ్ ట్యాబ్ ద్వారా ఇమేజ్‌నుఅప్‌లోడ్ చేయండి. తద్వారా మీకు కావాల్సిన ఇమేజ్‌ను గూగుల్ సెర్చ్ చేసి పెడుతుంది.

☛ ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్​ను ఎంచుకోండి. మీకు కావాల్సిన ఫోటోలు కనిపిస్తాయి.

☛ మీ వద్ద ఉన్న ఇమేజ్‌ను గూగుల్ ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా సిమిలార్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్‌లో సైతం రివర్స్ సెర్చ్ ద్వారా మీకు కావాల్సిన ఇమేజెస్‌ను ఇట్టే వెతుక్కోవచ్చు.. ఎలాగంటే..

☛  రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్ సెర్చ్ చేయాలనుకుంటే మీ ఫోన్‌లో గూగుల్ యాప్ ఖచ్చితంగా ఉండాలి.

☛ సెర్చ్ బార్‌లో కెమెరా ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయి పిక్చర్ తీసుకోవాలా? అని మిమ్మల్ని అడుగుతుంది.

► కెమెరా నుంచి మీరు ఫొటో తీయొచ్చు లేదా మీ ఫోన్‌లోని ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఆ విండో కింది భాగంలో ఎడమ వైపున ఉండేసెలక్ట్ యాన్ ఇమేజ్ అనే ఆప్షన్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫోటోలు వస్తాయి. తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Follow Us
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ