Redmi Note 11 Pro: రెడ్‌మి నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే..!
Redmi Note 11 Pro: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi రెడ్‌మి బ్రాండ్ నుంచి రెండు వేరియంట్లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది...
Redmi Note 11 Pro: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi రెడ్‌మి బ్రాండ్ నుంచి రెండు వేరియంట్లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Redmi Note 11 Pro, Redmi Note 11 Pro+ రెండు వేరియంట్లు భారత మార్కెట్లో మార్చి 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కంపెనీ రెడ్‌మి ఇండియా ధృవీకరించింది. గత కొన్ని రోజులుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ డివైజ్ కెమెరా స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది.
రెడ్‌మి ఇప్పటికే Note 11, Note 11Sలను భారత్‌లో విడుదల చేసింది. ఇప్పుడు Redmi Pro మోడల్స్ లైనప్‌కు మెరుగైన ఫీచర్లను తీసుకొస్తోంది. Redmi Note 11 సిరీస్ గత ఏడాది చైనాలో ఫిబ్రవరి ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ ఫోన్‌లను ఆవిష్కరించేందుకు Redmi ఆన్‌లైన్ ఈవెంట్‌ను హోస్ట్ చేయనుంది.
Redmi Note 11 Pro, Note 11 Pro+ ఫీచర్లు :
Redmi Note 11 Pro గ్లోబల్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67 ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగూ 6GB/8GB ర్యామ్, 64GB/128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. MediaTek Helio G96 చిప్‌సెట్ అందిస్తోంది. ఈ రెండు మోడళ్లలో స్టోరేజీని Micro SD కార్డ్ ఉపయోగించి 1TB వరకు ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే వెనుక కెమెరా 108-MP ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రావైడ్ లెన్స్, 2-MP డెప్త్ సెన్సార్ 2-MP మాక్రో కెమెరాను కలిగి ఉండనుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 16-MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తోంది. Pro+ మోడల్‌లో ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 695 చిప్ 5G కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. కెమెరా సిస్టమ్ 3 సెన్సార్‌లతో మాత్రమే రానుంది. Redmi Note 11 Pro+ Redmi Note 11 Pro రెండు ఫోన్ల ధర రూ. 16,499 ఉండే అవకాశం ఉంది.
T̵h̵e̵ ̵b̵e̵s̵t̵ ̵R̵e̵d̵m̵i̵ ̵N̵o̵t̵e̵ ̵ The best Redmi Note is about to get a ????? ??? ??????! #BestGetsBetter
Gear up for the MEGA launch of #RedmiNote11Pro and #RedmiNote11ProPlus5G, coming your way on 9th March 2022 at 12 noon.
?https://t.co/8jSoTpMX2Z pic.twitter.com/sEFVYONQwm
— Redmi India (@RedmiIndia) February 25, 2022
ఇవి కూడా చదవండి: