- Telugu News Photo Gallery Technology photos Oppo Launches New Tablet. Have a look on oppo pad features and price details
Oppo Pad: మార్కెట్లోకి ఒప్పో నుంచి కొత్త టాబ్లెట్.. ఆకట్టుకునే ఫీచర్లు ఒప్పో పాడ్ సొంతం..
Oppo Pad: చైనాకు చెందిన ప్రముఖ తయారీ సంస్థ ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఒప్పో పాడ్ పేరుతో ఈ టాబ్లెట్‌ను లాంచ్ చేశారు. మొత్తం మూడు వేరియెంట్లలో తీసుకొచ్చిన ఈ పాడ్‌లో ఉన్న ఆకట్టుకునే ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Feb 26, 2022 | 1:32 PM

ఎప్పటికప్పుడు కొంగొత్త స్మార్ట్ ఫోన్‌లు తీసుకొస్తూ టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనాకు చెందిన ప్రముఖ తయారీ సంస్థ ఒప్పో తాజాగా ఓ టాట్లెట్‌ను తీసుకొచ్చింది. ఒప్పో పాడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్‌లోని ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 800 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ టాబ్లెట్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 11 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 2560 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఈ టాబ్లెట్ స్క్రీన్ సొంతం. ప్రస్తుతం చైనాలో మార్కెట్లో విడుదలైన ఈ టాబ్ త్వరలోనే భారత్‌లోకి రానుంది.

ఈ టాబ్లెట్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 8360 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. టాబ్లెట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఒప్పో పాడ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ టాబ్లెట్‌లో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను అందించారు.

ఇక ఒప్పో పాడ్ ధర విషయానికొస్తే ఈ టాబ్లెట్‌ను మొత్తం మూడు వేరియెంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. రూ. 27,500, 6 జీబీ+256 జీబీ ధర రూ. 32,300, 8 జీబీ+256 జీబీ ధర రూ. 38,800గా ఉంది.





























