ప్రపంచంలో తొలిసారి.. మడతపెట్టే ల్యాప్‌టాప్

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు మడతపెట్టే ఫోన్ల గురించి మాత్రమే విన్నాం. ఇకపై మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు అందుబాటు లోకి వచ్చేశాయి. తాజాగా లెనోవో సంస్థ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ని ఆవిష్కరించింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుంది. ఫోల్డబుల్ స్క్రీన్‌ను కలిగిన దీనికి ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరు పెట్టేసింది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. 13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, […]

  • Anil kumar poka
  • Publish Date - 9:34 am, Wed, 15 May 19
ప్రపంచంలో తొలిసారి.. మడతపెట్టే ల్యాప్‌టాప్

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు మడతపెట్టే ఫోన్ల గురించి మాత్రమే విన్నాం. ఇకపై మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు అందుబాటు లోకి వచ్చేశాయి. తాజాగా లెనోవో సంస్థ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ని ఆవిష్కరించింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుంది. ఫోల్డబుల్ స్క్రీన్‌ను కలిగిన దీనికి ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరు పెట్టేసింది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. 13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 2030 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలన్నది ప్లాన్. ఇప్పుడిది టెక్నాలజీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడేళ్లగా ఈ డివైస్‌పై పని చేసినట్టు పేర్కొంది ఆ సంస్థ. దీంతోపాటు మరో రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది ఆ సంస్థ.