QR Code Scam: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో రూ. 50లక్షలు నష్టం.. అదెలా.. ఇది చదవండి..

చైనాలోని ఓ మహిళ సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకోవడం తనకు చేటు చేసింది. నిజానికి ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఫుడ్, ఆమె చిత్రాలతో పాటు పొరపాటున టేబుల్ పై ఉన్న హోటల్ వారు అందించిన ఆర్డర్ క్యూఆర్ కోడ్‌ను కూడా షేర్ చేసింది. ఆ తర్వాత ఆమె పేరు మీద, ఆ టేబుల్ నంబర్ మీద లక్షల విలువైన ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఆ బిల్లు ఎంత అయ్యిందో తెలుసా ఏకంగా రూ. 50లక్షలు.

QR Code Scam: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో రూ. 50లక్షలు నష్టం.. అదెలా.. ఇది చదవండి..
Qr Code Menu
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2023 | 9:16 PM

ప్రస్తుత ఆధునిక సమాజంలో అత్యాధునిక సాంకేతికత ప్రజలకు అనేక సౌకర్యాలను, సౌలభ్యాలను అందిస్తోంది. అయితే అదే స్థాయిలో నష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. గత వారంలో ప్రముఖ సినీ నటీ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత సన్సేషన్ సృష్టించిందో అందరం చూశాం. దీని తర్వాత అందివస్తున్న సాంకేతిక దుర్వినయోగంపై అందరిలో ఆందోళన స్థాయి పెరిగింది. గతంలో కూడా టెక్నాలజీని దుర్వినియోగం చేసిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో అనేక మంది తమ ప్రతి కదలికను సోషల్ మీడియాలో వీడియోలు, చిత్రాలను షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఘటన భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. చైనాలోని ఓ మహిళ సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకోవడం తనకు చేటు చేసింది. నిజానికి ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఫుడ్, ఆమె చిత్రాలతో పాటు పొరపాటున టేబుల్ పై ఉన్న హోటల్ వారు అందించిన ఆర్డర్ క్యూఆర్ కోడ్‌ను కూడా షేర్ చేసింది. ఆ తర్వాత ఆమె పేరు మీద, ఆ టేబుల్ నంబర్ మీద లక్షల విలువైన ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఆ బిల్లు ఎంత అయ్యిందో తెలుసా ఏకంగా రూ. 50లక్షలు. ఇది చూసి కంగుతిన్న ఆమె హోటల్ యాజమాన్యానికి విషయం చెప్పింది.

అసలేం జరిగిందంటే..

చైనాకు చెందిన వాంగ్‌ అనే మహిళకు ఈ అసాధారణ అనుభవం ఎదురైంది. ఆమె నవంబర్ 23న ఒక స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌ను సందర్శించారు, వారు ఆస్వాదించిన రుచికరమైన వంటకాల ఫోటోలను మాత్రమే పంచుకునేందుకు ఉద్దేశించినట్లు సౌత్ మార్నింగ్ చైనా పోస్ట్ నివేదించింది. ఆమె తన ప్రైవేట్ వీచాట్(WeChat) మూమెంట్స్ పేజీలో రెస్టారెంట్ లోని ఫుడ్ చిత్రాలతో పాటు టేబుల్ పై ఉన్న ఆర్డర్ క్యూఆర్ కోడ్‌ను షేర్ చేసింది. వాస్తవానికి దానిని ఆమె ఓ స్టిక్కర్‌ భావించి, షేర్ చేసింది. అది మెనూ కోసం ఉంచిన ఆర్డర్ క్యూఆర్ కోడ్ అని తెలుసుకోలేకపోయింది. ఈ పొరపాటు వల్ల ఆ మహిళ 430,000-యువాన్ (US$60,000), మన కరెన్సీలో 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీనిని గ్రహించిన ఆ మహిళ వెంటనే ఆ వీచాట్ పోస్ట్ ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి.

ఈ విషయాన్ని బాధిత మహిళ రెస్టారెంట్ యజమానికి చెప్పగా.. అతను కూడా ఎవరు ఆర్డర్ చేశారో ఆచూకీ లభించలేదు. ఆ డబ్బును తిరిగి పొందలేకపోయాడని సమాచారం. అయితే ఆన్‌లైన్‌లో ఫోటోలను షేర్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ఆ మహిళ సోషల్ మీడియాలో చెప్పడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బాధిత మహిళ పట్ల ప్రజలు సానుభూతి తెలిపారు. ఈ ఘటన తర్వాత, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది ఓ పాఠం..

ఇది ప్రస్తుతం డిజిటల్ భద్రతలో ఊహించని పాఠంగా మారింది. ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను భాగస్వామ్యం చేసేటప్పుడు అవగాహన, జాగ్రత్త అవసరమని హెచ్చరించింది. ఏదో సరదాగా చేసే పోస్టులు ఊహించలేని పరిణామాలకు దారి తీస్తుందని గుర్తు చేసింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రధాని చెంతకు లావేరుకళాకారుడి ప్రతిభ మోడీ చిత్రంతో చేనేత వస్త్రం
ప్రధాని చెంతకు లావేరుకళాకారుడి ప్రతిభ మోడీ చిత్రంతో చేనేత వస్త్రం
ఈ కోమలి అందానికి ఆ చందమామ కూడా ఫిదా.. వర్షిణి పిక్స్ వైరల్..
ఈ కోమలి అందానికి ఆ చందమామ కూడా ఫిదా.. వర్షిణి పిక్స్ వైరల్..
పోస్టల్ జీడీఎస్ రిజల్ట్‌ వచ్చేది అప్పుడే..! గతేడాది కటాఫ్‌ ఎంతంటే
పోస్టల్ జీడీఎస్ రిజల్ట్‌ వచ్చేది అప్పుడే..! గతేడాది కటాఫ్‌ ఎంతంటే
హీరోయిన్‌కు లేని బాధ మీకెందుకు..
హీరోయిన్‌కు లేని బాధ మీకెందుకు..
ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ అదిరింది.. కానీ ఇవి అంతకుమించి..
ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ అదిరింది.. కానీ ఇవి అంతకుమించి..
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత.. ఏమిటంటే
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత.. ఏమిటంటే
రాజస్థాన్‌లోని బార్మర్ తెలుసా.? ఇక్కడ టెంపుల్స్ ఒక్కసారైన చూడాలి.
రాజస్థాన్‌లోని బార్మర్ తెలుసా.? ఇక్కడ టెంపుల్స్ ఒక్కసారైన చూడాలి.
మొబైల్ నంబర్ మారకుండా.. నెట్‌వర్క్ మారాలా? ఈ సింపుల్ టిప్స్..
మొబైల్ నంబర్ మారకుండా.. నెట్‌వర్క్ మారాలా? ఈ సింపుల్ టిప్స్..
‘APPSC గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’
‘APPSC గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’