Electricity Bill : కరెంట్ బిల్ రోజు రోజుకు పెరుగుతుందా..! అయితే ఈ 5 పద్దతుల ద్వారా ఆదా చేయండి..
Electricity Bill : ప్రతి నెలా మీ కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా.. వాస్తవానికి కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరు
Electricity Bill : ప్రతి నెలా మీ కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా.. వాస్తవానికి కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరు వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో బిల్లు కూడా ఎక్కువగా వస్తోంది. కానీ దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఐదు పద్దతుల ద్వారా విద్యుత్‌ని ఆదా చేయవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. ఎలక్ట్రిక్ పరికరాలను ఆపివేయడం మర్చిపోవద్దు లైట్, ఫ్యాన్, ఏసీని ఆపివేయకుండా తరచూ గది నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది సరైనది కాదు. ఉపయోగంలో లేనప్పుడు ఎలక్ట్రికల్ పరికరాలను ఆపివేయాలి. దీంతో మీరు విద్యుత్తు వృధా చేయకుండా ఉండగలుగుతారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లు కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. విద్యుత్తు ఆదా చేయడానికి ఇది సులభమైన మార్గం.
2, ఎల్‌ఈడీ బల్బులు వాడండి.. పాత ఫిలమెంట్ బల్బులు, సిఎఫ్ఎల్ లు చాలా విద్యుత్తును వినియోగిస్తాయి. వాటిని ఎల్‌ఈడీ బల్బులతో భర్తీ చేస్తే మీ విద్యుత్ బిల్లు తగ్గడమే కాకుండా వెలుతురు కూడా రెట్టింపు అవుతుంది. గణాంకాల గురించి మాట్లాడితే 100 వాట్ల ఫిలమెంట్ బల్బ్ 10 గంటల్లో ఒక యూనిట్ విద్యుత్తును వినియోగిస్తుంది. కాగా 15W సిఎఫ్ఎల్ 66.5 గంటల్లో ఒక యూనిట్ విద్యుత్తును వినియోగిస్తుంది. అదే సమయంలో 9-వాట్ల LED 111 గంటల తర్వాత ఒక యూనిట్ విద్యుత్తును వినియోగిస్తుంది.
3. ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్‌లను గమనించాలి.. ఫ్రిజ్, ఎయిర్ కండీషనర్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 5 నక్షత్రాల రేటింగ్‌తో పరికరాలను కొనుగోలు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ విద్యుత్ బిల్లు చాలా తక్కువగా ఉంటుంది.
4. 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఏసీని వాడండి.. ఎయిర్ కండీషనర్ ఎల్లప్పుడూ 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నడుపాలి. ఇది ఆదర్శవంతమైన ఉష్ణోగ్రత. ఇది గదిలో చల్లదనాన్ని కూడా ఉంచుతుంది. దీంతోపాటు మీరు టైమర్‌ను ఉపయోగించవచ్చు. టైమర్ సెట్ చేస్తే గది చల్లగా ఉన్నప్పుడు AC దానంతట అదే ఆగిపోతుంది. ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి నెలా 4,000 నుంచి 6,000 రూపాయలు ఆదా చేయవచ్చు.
5. బహుళ గాడ్జెట్ల కోసం పవర్ స్ట్రిప్స్‌ని ఉపయోగించండి మీకు ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉంటే వాటిని పవర్ స్ట్రిప్‌లోకి ప్లగ్ చేయండి. ఈ అంశాలు ఉపయోగంలో లేనప్పుడు “ఫాంటమ్” శక్తి నష్టాన్ని నివారించడానికి మీరు వాటిని ఒకేసారి ఆపివేయవచ్చు.