AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctors White Coats: వైద్యులు వైట్‌ కలర్‌ కోట్‌ ఎందుకు ధరిస్తారు.. దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏమిటి..? పూర్తి వివరాలు

Doctors White Coats: కొన్ని విషయాల వెనుక ఎంతో రహస్యం దాగి ఉంటుంది. కానీ మనం పెద్దగా పట్టించుకోము. ఇక వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తెల్లటి కోట్లు ధరిస్తారు. కానీ..

Doctors White Coats: వైద్యులు వైట్‌ కలర్‌ కోట్‌ ఎందుకు ధరిస్తారు.. దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏమిటి..? పూర్తి వివరాలు
Subhash Goud
|

Updated on: Jan 31, 2022 | 1:13 PM

Share

Doctors White Coats: కొన్ని విషయాల వెనుక ఎంతో రహస్యం దాగి ఉంటుంది. కానీ మనం పెద్దగా పట్టించుకోము. ఇక వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తెల్లటి కోట్లు ధరిస్తారు. కానీ వారు ఆ తెలుపు రంగును ఎందుకు ధరిస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? దీని ఈ తెల్లటి కోట్‌ ధరించడం వెనుక రోగులు, వైద్యుల భద్రతకు సంబంధించినది ఉంది.తెల్ల కోటు వైద్య వృత్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. నివేదికల ప్రకారం పరిశీలిస్తే.. కోటు తెల్లగా ఉండటం వల్ల మనుషులకు ఇన్ఫెక్షన్‌ అనేది సంక్రమించుకుండా ఉంటుంది. అలాగే తెల్లటి కోటుపై రక్తం, రసాయనాలు పడినట్లయితే వాటి గుర్తులు సులభంగా కనిపిస్తాయి. ఈ విధంగా రోగి నుండి వైద్యులకు, ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. రక్తం లేదా మరేదైనా రసాయనం జాడ ఉంటే దానిని మార్చవచ్చు. దాని వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇన్ఫెక్షన్ నుండి రక్షించడమే కాకుండా, తెల్లటి కోటు ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కోటు ధరించిన వ్యక్తి డాక్టర్ లేదా వైద్య సిబ్బంది అని తెలిసిపోతుంది. ఇది రోగులను బాగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ తెల్లటి కోటు శుభ్రతకు చిహ్నం కూడా. తెల్లకోటుపై వైద్యుల అభిప్రాయంపై సర్వే కూడా చేశారు. BMJ జర్నల్ నివేదిక ప్రకారం.. 400 మంది రోగులు, 86 మంది వైద్యులపై సర్వే చేశారు. వారిని పలు ప్రశ్నలు అడిగారు. తెల్ల కోటు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ 70 శాతం వరకు నివారిస్తుందని వైద్యులు విశ్వసిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అలాగే తెల్లటి రంగు కోటు గురించి రోగులు ఏమనుకుంటున్నారనే దానిపై కూడా ఒక పరిశోధన జరిగింది. ముఖ్యంగా వృద్ధులను పరిశోధనలో చేర్చారు. వృద్ధులు తెలుపు రంగు తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. వైద్యులు తెల్లటి కోట్లు ధరించడం వల్ల రోగులు సుఖంగా ఉంటారు. వారిలో ఆత్మవిశ్వాసం పొందుతారని తేలింది.

ఇవి కూడా చదవండి:

Milk Teeth: పిల్లలకు పాల దంతాలు ఎందుకు ఊడిపోతుంటాయి..? అవి కోల్పోవడానికి కారణం ఏమిటి..?

One Ddigital ID: మరో కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. గుర్తింపు పత్రాలన్నీ అనుసంధానం చేస్తూ ఒకే డిజిటల్‌ ఐడీ..!