Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: పది రోజుల్లో ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయడం మానేస్తుంది! మీ ఫోన్ అందులో ఉందేమో ఇక్కడ చెక్ చేసుకోండి!

కొన్ని ఫోన్లలో వాట్సప్ యాప్ నిలిపివేస్తామని కొంతకాలంగా ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెబుతూ వస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించి తేదీ విడుదల చేసింది.

WhatsApp: పది రోజుల్లో ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయడం మానేస్తుంది! మీ ఫోన్ అందులో ఉందేమో ఇక్కడ చెక్ చేసుకోండి!
Follow us
KVD Varma

|

Updated on: Oct 22, 2021 | 11:20 AM

WhatsApp: కొన్ని ఫోన్లలో వాట్సప్ యాప్ నిలిపివేస్తామని కొంతకాలంగా ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెబుతూ వస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించి తేదీ విడుదల చేసింది. చాలా స్మార్ట్‌ఫోన్‌లపై నవంబర్ 01 నుంచి వాట్సప్ పనిచేయడం ఆపేయనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి పాత వెర్షన్‌లకు ఈ యాప్ మద్దతు ఇవ్వదని వాట్సాప్ తన ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ OS 4.1.. దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు మాత్రమే వాట్సప్ యాప్ మెసేజింగ్ యాప్‌ని ఉపయోగించగలరు.

ఆండ్రాయిడ్.. ఐఓఎస్ వినియోగదారులందరూ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడం ద్వారా వాడుతున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ని కూడా చెక్ చేయవచ్చు.

నవంబర్ 10 నుంచి వాట్సప్ నిలిచిపోనున్న ఫోన్లు ఇవే..

ఐ ఫోన్:

ఐఫోన్ 6 ఎస్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ

శామ్సంగ్ :

శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్ గెలాక్సీ SII గెలాక్సీ ట్రెండ్ II గెలాక్సీ ఎస్ 3 మినీ గెలాక్సీ కోర్ గెలాక్సీ Xcover 2 గెలాక్సీ ఏస్ 2

ఎల్జీ..

ఎల్జీ లూసిడ్ 2 ఆప్టిమస్ L5 డ్యూయల్ ఆప్టిమస్ L4 II డ్యూయల్ ఆప్టిమస్ F3Q ఆప్టిమస్ F7 ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L3 II డ్యూయల్ ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L5 ఆప్టిమస్ L5 II ఆప్టిమస్ L3 II ఆప్టిమస్ L7 ఆప్టిమస్ L7 II డ్యూయల్ ఆప్టిమస్ L7 II ఆప్టిమస్ F6 ఆప్టిమస్ F3 ఆప్టిమస్ L4 II ఆప్టిమస్ L2 II ఆప్టిమస్ నైట్రో HD మరియు 4X HD

ZTE

ZTE గ్రాండ్ S ఫ్లెక్స్ గ్రాండ్ X క్వాడ్ V987 ZTE V956 గ్రాండ్ మెమో

హువావే

ఎస్సేండ్ G740 ఎస్సేండ్ D క్వాడ్ XL ఎస్సేండ్ మాటే ఎస్సేండ్ P1 S ఎస్సేండ్ D2 ఎస్సేండ్ D1 క్వాడ్ XL.

ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..