Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Transplant: పంది కిడ్నీ మనిషికి.. ప్రపంచంలో తొలిసారిగా విజయవంతం అయిన ఆపరేషన్.. ఇది ఎలా చేశారంటే..

కిడ్నీ.. మనిషికి అతి ముఖ్యమైన అవయవం. కిడ్నీ పాడయితే దానిని మార్చడం తప్పితే మరోమార్గం లేదు. అయితే, కిడ్నీ మార్చాలంటే మరో మనిషి తన మూత్ర పిండం దానం చేయాల్సిన అవసరం ఉంది.

Kidney Transplant: పంది కిడ్నీ మనిషికి.. ప్రపంచంలో తొలిసారిగా విజయవంతం అయిన ఆపరేషన్.. ఇది ఎలా చేశారంటే..
Kidney Transplant
Follow us
KVD Varma

|

Updated on: Oct 21, 2021 | 5:52 PM

Kidney Transplant: కిడ్నీ.. మనిషికి అతి ముఖ్యమైన అవయవం. కిడ్నీ పాడయితే దానిని మార్చడం తప్పితే మరోమార్గం లేదు. అయితే, కిడ్నీ మార్చాలంటే మరో మనిషి తన మూత్ర పిండం దానం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో రిస్క్ తో కూడిన పని. చాలా మంది సమయానికి కిడ్నీ దొరకక మరణిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో మూత్రపిండాల మార్పిడి విషయంలో పెద్ద విజయం సాధించారు అమెరికా వైద్యులు. అక్కడ పంది మూత్రపిండాన్ని మానవులలోకి మార్పిడి చేశారు. ఇలాంటి కేసు ప్రపంచంలో ఇదే మొదటిది. న్యూయార్క్ లోని NYU లంగావన్ హెల్త్ హాస్పిటల్ లో ఈ మార్పిడి జరిగింది. ఇది ఒక పెద్ద ముందడుగు అని నిపుణులు అంటున్నారు. దశాబ్దాలుగా మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తుల కోసం జంతువుల అవయవాలను మార్పిడి చేయడానికి ఈ విజయంతో మార్గం సుగమం కావచ్చు.

ఈ మార్పిడి ప్రక్రియ సులభం కాదు. దీని కోసం, మానవ శరీరం పంది మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండటానికి శాస్త్రవేత్తలు సంవత్సరాల పాటు సన్నాహాలు చేయాల్సి వచ్చింది. మార్పిడికి ఎలా సిద్ధం కావాలి, మానవులకు పంది కిడ్నీని ఎలా సరిచేయాలి..మార్పిడి ఎంత విజయవంతమైంది.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..

మానవ మార్పిడికి అనువైన పంది కిడ్నీని తయారు చేశారు

జంతువుల అవయవాలను మానవులలోకి మార్పిడి చేసే అతి పెద్ద ప్రమాదం తిరస్కరణ. దీనిగురించి సాధారణ భాషలో చెప్పాలంటే..మానవ శరీరం ఇతర జంతువుల శరీర భాగాలను అంగీకరించదు. ఈ సవాలును అధిగమించడానికి, శాస్త్రవేత్తలు మొదట పంది పిండంలో ఉన్న జన్యువులలో మార్పులు చేశారు. పరివర్తన తరువాత, ఆ అణువులు వాటి శరీరం నుండి తొలగించారు. ఎందుకంటే, ఇవి మార్పిడి తర్వాత సమస్యలను కలిగిస్తాయి. ఈ పిండాల నుండి ఏర్పడిన పంది రోగనిరోధక వ్యవస్థ మానవ రోగనిరోధక వ్యవస్థతో సమన్వయం చేయగలగేలా మారుతుంది.

దీని తరువాత, పంది థైమస్ గ్రంధిని శస్త్రచికిత్స ద్వారా ఒక మూత్రపిండానికి అనుసంధానించారు. దానిని మానవులలోకి మార్పిడి చేసినప్పుడు దానిలో ఉత్పత్తి అయ్యే రోగనిరోధక ప్రతిస్పందనను ఇది తగ్గిస్తుంది. కొంత సమయం తరువాత, మెదడు చనిపోయిన రోగి తొడపై పంది మూత్రపిండాన్ని మార్పిడి చేశారు. తద్వారా దానిని సులభంగా పర్యవేక్షించవచ్చు. ఈ బ్రెయిన్ డెడ్ రోగి కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. కాబట్టి బంధువుల సమ్మతి తర్వాత రోగిని ప్రయోగంలో చేర్చారు.

మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయా లేదా అని తనిఖీ చేయడానికి ఇటువంటి శస్త్రచికిత్స చేశారు. రోగి శరీరంలో రక్తాన్ని తీసుకువెళ్లే , తీసుకువచ్చే నాళాలకు కొత్త కిడ్నీని కనెక్ట్ చేసింది. దీనిని తదుపరి 3 రోజులు పర్యవేక్షించారు. పరిశోధకుడు డాక్టర్ రాబర్ట్ మోంట్గోమేరీ మాట్లాడుతూ, మూత్రపిండాన్ని మానవ శరీరం అంగీకరించింది. సాధారణంగా పనిచేయడం ప్రారంభించింది.

కొత్త కిడ్నీ మార్పిడి తర్వాత ఊహించినంత ఎక్కువ మూత్రాన్ని విడుదల చేస్తుందని డాక్టర్ రాబర్ట్ చెప్పారు. అంతా మామూలుగానే ఉంది. మార్పిడికి ముందు, రోగికి అధిక స్థాయిలో క్రియేటినిన్ ఉంది, ఇది మూత్రపిండాలను దెబ్బతీసింది. మార్పిడి తర్వాత ఇది సాధారణ స్థితికి వచ్చింది.

అవయవ మార్పిడి కోసం యూఎస్ లో 1,07,000 మందికి పైగా వేచి ఉన్నారు. వీరిలో, కిడ్నీలు అవసరం ఉన్నవారు 90 వేలకు పైగా ఉన్నారు. సగటున, ఒక వ్యక్తి కిడ్నీ కోసం 3 నుండి 5 రోజులు వేచి ఉండాలి. అదే సమయంలో, యూకేలో 6,100 మందికి పైగా అవయవ మార్పిడి కోసం లైన్‌లో ఉన్నారు. ఇందులో 4,584 మంది రోగులకు మూత్రపిండ మార్పిడి అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి: Corona New Variant: అక్కడ కరోనా వైరస్ కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రమాదం లేకపోయినా.. జాగ్రత్త పడకపోతే అంతే!

Ola Electric Scooter: ఎదురుచూపులకు పుల్‌స్టాప్! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ తేదీలు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచి అంటే..

Petrol Price: వినియోగదారులకు మరింత మోత.. పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.. కారణాలు ఏమిటంటే..