Whatsapp UPI Payment: వాట్సాప్‌లో డబ్బులను ఎలా పంపించుకోవాలో తెలుసా.? ఈ సింపుల్ టిప్స్‌తో సాధ్యం..
Whatsapp UPI Payment: స్మార్ట్ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరగడం, ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరగడంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వినియోగదారుడు బ్యాంకుకు వెళ్లకుండానే కేవలం స్మార్ట్‌ఫోన్‌తోనే..
Whatsapp UPI Payment: స్మార్ట్ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరగడం, ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరగడంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వినియోగదారుడు బ్యాంకుకు వెళ్లకుండానే కేవలం స్మార్ట్‌ఫోన్‌తోనే అన్ని రకాల పనులను చేసేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో రకాల మొబైల్ వ్యాలెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బులు పంపించుకోవడం సింపుల్‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ ఆప్షన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి వాట్సాప్ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో ఓసారి తెలుసుకుందామా..!
* ఇందుకోసం ముందుగా వాట్సాప్‌లో కుడివైపు పైన సెర్చ్ బటన్ పక్కన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయాలి. * అనంతరం అందులో పేమెంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. * తర్వాత యాడ్ పేమెంట్‌పై మెథడ్‌పై క్లిక్ చేసి.. మీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న బ్యాంకును సెలక్ట్ చేసుకోని వెరిఫై చేసుకోవాలి. * ఇలా చేసిన తర్వాత న్యూ పేమెంట్ పై క్లిక్ చేసి..యూపీఐ ఐడీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోని డబ్బులు పంపించుకోవచ్చు. * అలా కాకుండా వాట్సాప్ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్న ఇతర యూజర్లకు ఫోన్‌నెంబర్ ద్వారా నేరుగా డబ్బులు పంపించుకునే అవకాశం ఉంది.
Also Read: Windows 11: విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఎప్పటి నుంచి అందుబాటులోకి రావచ్చు? ఎలా ఉండబోతోంది?
US vs China: అంతరిక్షానికి పాకిన అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం.. తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు
Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా.?