AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Tips: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఒక్క ట్యాప్‌తో సైబర్ దాడుల నుంచి రక్షణ.. అందరూ ఆన్ చేసుకోండి..

వాట్సప్ వాడేవారికి మరో కొత్త ఆఫ్షన్ అందుబాటులోకి వచ్చింది. మీ వాట్సప్ అకౌంట్ సైబర్ దాడుల బారిన పడకుండా ఇది ఉపయోగపడనుంది. కేవలం ఒక ట్యాప్‌తో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎలా ఈ ఆప్షన్ వాట్సాప్‌లో ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం.

WhatsApp Tips: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఒక్క ట్యాప్‌తో సైబర్ దాడుల నుంచి రక్షణ.. అందరూ ఆన్ చేసుకోండి..
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Jan 28, 2026 | 5:43 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడుతున్న సోషల్ మీడియా మెస్సేజింగ్‌ యాప్‌గా వాట్సప్ కొనసాగుతోంది. యూజర్ల భద్రత కోసం వాట్సప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సెక్యూరిటీ కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీ వాట్సప్‌కు మరింత భద్రత ఉంటుంది. ఇటీవల సైబర్ దాడులు ఎక్కువైపోతున్నాయి. స్పామ్ లింక్‌లు పంపి వాట్సప్‌ను హ్యాక్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో తమ యూజర్లు సైబర్ దాడుల బారిన పడకుండా వాట్సప్ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఆప్షన్ కొత్తగా తీసుకొచ్చింది. ఒక్క ట్యాప్‌తో మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సైబర్ దాడుల నుంంచి బయటపడవచ్చు.

సైబర్ దాడుల నుంచి రక్షణ

సైబర్ దాడులతో పాటు హ్యాకింగ్, ఇతర సైబర్ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలను ఎక్కువగా సంప్రదించే వ్యక్తుల జాబితాలో ఉన్నవారికి ఈ ఆప్షన్ ఎక్కువగా ఉపయోగపడుతుందని వాట్సప్ తెలిపింది. ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయనేది వాట్సప్ వెల్లడించింది. అవేంటంటే.. తెలియని వ్యక్తి నుంచి వచ్చిన మీడియా ఫైల్స్, అటాచ్‌మెంట్స్ బ్లాక్ అవుతాయి. లింక్ ప్రివ్యూలు నిలిపివేయడం, ఛాట్‌లో యూఆర్‌ఎల్ షేర్ చేసినప్పుడు కనిపించే థంబ్ నెయిల్‌లు, తెలియని వ్యక్తి నుంచి కాల్స్ సైలెంట్ మోడ్‌లో పెట్టడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అధునాతన సైబర్ దాడుల నుంచి మిమ్మల్ని ఈ ఫీచర్ కాపాడుతుంది.

అన్నీ ఒకేచోట

ప్రస్తుతం ఈ భద్రతా ఫీచర్లు వేరే వేరే ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకే చోట ఉండేలా ఈ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్‌ను వాట్సప్ ప్రవేశపెట్టింది. వేరే వేరే ఆప్షన్లను ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ట్యాప్‌తో ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. దీంతో మీ వాట్సప్ అకౌంట్ సైబర్ దాడుల బారిన పడకుండా ఉంటుంది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు అందుబాటులోకి రాగా.. త్వరలో అందరికీ ఈ ఆప్షన్ కనిపించనుంది. ఇండియాలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో భారత యూజర్లకు ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఆప్షన్ ఇలా ఎనేబుల్ చేయండి

-మీ మొబైల్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి -సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి -ప్రైవసీ ట్యాబ్‌ను క్లిక్ చేయండి -అడ్వాన్స్‌డ్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి -అక్కడ స్ట్రిక్ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి -కేవలం ఆప్షన్ కనిపించకపోతే వాట్సప్ యాన్‌ను అప్డేట్ చేసుకోండి