AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scam Alert: పాత రూపాయి నోటు ఇస్తే ఎక్కువ డబ్బు ఇస్తామనే మెసేజ్‌ వచ్చిందా? ఆశపడి మోసపోకండి!

ఈ మధ్య సైబర్ నేరగాళ్లు పాత రూపాయి, రెండు రూపాయిల నోట్లను కొంటామని వాట్సాప్ సందేశాలతో మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తున్నారు. లక్షలు ఇస్తామని ఆశపెట్టి, ఆధార్, పాన్ వివరాలు, ఓటీపీలు అడిగి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దు.

Scam Alert: పాత రూపాయి నోటు ఇస్తే ఎక్కువ డబ్బు ఇస్తామనే మెసేజ్‌ వచ్చిందా? ఆశపడి మోసపోకండి!
Old One Rupee Note
SN Pasha
|

Updated on: Jan 31, 2026 | 11:22 PM

Share

ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా కొత్త జిమ్మిక్కులతో వారి వద్ద నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పాత రూపాయి, రెండు రూపాయిల నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని కొంటాం అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. వాటికి బదులుగా మీకు వేలు, లక్షల్లో డబ్బు ఇస్తామంటూ అందులో పేర్కొంటున్నారు.

వాట్సాప్‌లో వచ్చే ఈ ఫేక్‌ మెసేజ్‌లను నిజం అనుకొని కొంతమంది తమ వద్ద ఉన్న పాత నోట్లకు బదులుగా వేల రూపాయలు వస్తాయని ఆశపడుతున్నారు. వెంటనే అందులో ఉన్న నంబర్లకు కాల్‌ చేసి, మా వద్ద పాత రూపాయి, రెండు రూపాయల నోట్లు ఉన్నాయని ఎంతకు కొంటారని అడుగుతున్నారు. అయితే అటు నుంచి సైబర్‌ మోసగాళ్లు.. ఆ నోటును ఫొటో తీసి వాట్సాప్‌లో పంపమని అడుగుతారు.

ఆ ఫొటోను పంపిన వెంటనే.. అది ఎంతో విలువైనదిగా చెబుతూ దాన్ని తమకే అమ్మలాని, అవసరం అయితే లక్ష రూపాయాలు అయినా ఇస్తామంటూ ఆశ పుట్టిస్తారు. అయితే ఆ నోటు కొనాలంటే ముందు మీ ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌ నంబర్లు, ఫొటోలు పంపాలని ఆడుతున్నారు. లక్షలు వస్తున్నాయనే ఆశతో ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌ పంపిన తర్వాత.. ఓటీపీలు కూడా ఆడిగి తెలుసుకొని.. వాటితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా చాలా మంది ఇప్పటికే మోసపోయారు. ఇలాంటి మెసేజ్‌లు మీకు కూడా వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న RBI
మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న RBI
యాపిల్ వాచ్‌లోని అత్యుత్తమ హిడెన్ ఫీచర్లు ఇవే
యాపిల్ వాచ్‌లోని అత్యుత్తమ హిడెన్ ఫీచర్లు ఇవే
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్‌ రుణాలపై బిగ్‌ రిలీఫ్
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్‌ రుణాలపై బిగ్‌ రిలీఫ్
టూత్ బ్రష్‌లో 4 రకాలు ఉంటాయని తెలుసా? ఎవరు ఏది వాడాలంటే..?
టూత్ బ్రష్‌లో 4 రకాలు ఉంటాయని తెలుసా? ఎవరు ఏది వాడాలంటే..?
గూగుల్‌ పిక్సెల్ ప్రియులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం
గూగుల్‌ పిక్సెల్ ప్రియులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం
ఆగస్టు 4 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు
ఆగస్టు 4 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు
TG SET 2026 అలర్ట్.. నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం.. ఈ తేదీలు
TG SET 2026 అలర్ట్.. నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం.. ఈ తేదీలు
కళ్లల్లో కారం చల్లి... కత్తులతో నరికి... RMP డాక్టర్ హత్య కేసులో
కళ్లల్లో కారం చల్లి... కత్తులతో నరికి... RMP డాక్టర్ హత్య కేసులో
సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను
సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను
'జబర్దస్త్' కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఫొటోస్ ఇదిగో
'జబర్దస్త్' కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఫొటోస్ ఇదిగో