WhatsApp new Feature: వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. వెబ్ వాట్సప్ యూజర్లకు పండగే..

|

Nov 22, 2022 | 7:00 AM

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2022లో చాలా అప్‌డేట్ అయ్యింది. ఈ సంవత్సర కాలంలో కొత్త కొత్త ఫీచర్లు విడుదలయ్యాయి.

WhatsApp new Feature: వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. వెబ్ వాట్సప్ యూజర్లకు పండగే..
Whatsapp
Follow us on

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2022లో చాలా అప్‌డేట్ అయ్యింది. ఈ సంవత్సర కాలంలో కొత్త కొత్త ఫీచర్లు విడుదలయ్యాయి. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 2 బిలియన్లకు పైగా ఉంది. భారతదేశంలోనే దాదాపు 550 మిలియన్ల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌లో తాజాగా మరిన్ని అప్‌డేట్‌లు వచ్చాయి. ఇవి ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్నాయి.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఎక్కువగా కొత్త ఆప్షన్‌లను ప్రవేశపెడుతున్న వాట్సాప్.. ఇప్పుడు తన వెబ్ వినియోగదారులకు ఉపయోగకరమైన ఆప్షన్‌ను అందిస్తోంది. వాట్సాప్ దీని గురించి సమాచారాన్ని షేర్ చేసింది. డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వినియోగదారులకు త్వరలో స్క్రీన్ లాక్ చేసే కొత్త ఆప్షన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది వాట్సాప్.

అవును, వాట్సాప్ ఎప్పుడూ తన వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి కీలక ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే కస్టమర్ల ప్రైవసీని మరింత పెంచేందుకు మరో అడుగు ముందుకేసింది. వాట్సాప్ వెబ్‌లో స్క్రీన్ లాక్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తుంది. దీని ప్రకారం వెబ్ ఆప్షన్‌లో వాట్సాప్‌ను తెరిచిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఇది వినియోగదారులు తమ డెస్క్‌టాప్‌లో ఉపయోగించనప్పుడు వాట్సాప్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా కాపాడుతుంది. అలాగని ఇది తప్పనిసరి కాదు. వినియోగదారులు అవసరమైనప్పుడు మాత్రమే ఈ స్క్రీన్ లాక్ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్..

వాట్సాప్ Android, iOS వినియోగదారుల కోసం ‘మిస్డ్ కాల్ అలర్ట్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. దీని గురించి కూడా ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ డోంట్ డిస్టర్బ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు వాట్సాప్‌లో కాల్ చేస్తే ఈ ఆప్షన్ మీకు రిమైండ్ చేస్తుంది. అంటే మీరు ఏదైనా కాల్ మిస్ చేసినట్లయితే సమాచారం తెలుపుతుందన్నమట. ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ దాదాపు అంతా రెడీ చేసింది. ఈ ఫీచర్లు తాజా బీటా వెర్షన్ 2.22.24.7లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్లను ఇప్పటికే కొంతమంది బీటా వాట్సాప్ యూజర్లకు పరిచయం చేసింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..