Praho computer: రూ. 399కే కంప్యూటర్‌.. స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆవిష్కరణ..

ప్రస్తుతం కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ముఖ్యంగా కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరగడం, విద్యార్థులు కూడా ఇంటి నుంచే తరగతులు వినడంతో కంప్యూటర్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అయితే కంపూట్యర్‌, ల్యాప్‌టాప్‌ వంటివి కొనుగోలు..

Praho computer: రూ. 399కే కంప్యూటర్‌.. స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆవిష్కరణ..
Cloud Computer
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2022 | 7:16 PM

ప్రస్తుతం కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ముఖ్యంగా కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరగడం, విద్యార్థులు కూడా ఇంటి నుంచే తరగతులు వినడంతో కంప్యూటర్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అయితే కంపూట్యర్‌, ల్యాప్‌టాప్‌ వంటివి కొనుగోలు చేయాలంటే కచ్చితంగా రూ. వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అయితే చాలా మందికి డబ్బు పెట్టే స్థోమత లేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే సెల్లిజియన్‌ టెక్నాలజీ అనే ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో కంప్యూటర్స్‌ని అందిస్తోంది. నెలకు రూ. 399 చెల్లిస్తే చాలు.. ఎన్ని రోజులంటే అన్ని రోజులు కంప్యూటర్‌ ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించింది.

సెల్లిజియన్‌ ప్రహో పేరుతో తీసుకొచ్చిన ఈ కంప్యూటర్‌కు మానిటర్‌ ఉండదు. సీపీయూ కూడా ఉండదు. క్లౌడ్‌ విధానంలో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తారు. దీనిని పొందాలంటే రూ. 3,600 రీఫండబుల్‌ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నెలకు రూ. 399 చెల్లించాలి. దీనిని మానిటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కంప్యూటర్‌ను ఉపయోగించాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్ కనెక్షన్‌ ఉండాలి. ఈ కంప్యూటర్‌లో క్రోమ్, వాట్సప్ వెబ్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, గూగుల్ క్లాస్ రూమ్ వంటి ఆప్షన్స్‌ను అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ కంప్యూటర్‌ను వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్‌ టైమ్‌ రీప్లేస్‌ వారంటీ ఉండడం ఈ కంప్యూటర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ కంప్యూటర్‌ను విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు స్టార్టప్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డిఫ్రంట్‌ కంప్యూటర్‌ను సొంతం చేసుకోండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..