WhatsApp Channels: విజయదేవరకొండ వాట్సాప్‌లో ఏం చేస్తున్నారు? మీరూ తెలుసుకోవచ్చు! ట్రై చేయండి..

మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి వారితోనే మనం ఇప్పటి వరకూ వాట్సాప్ లో చాటింగ్లు చేశాం. అయితే దీని పరిధిని మరింత పెంచుతూ వాట్సాప్ కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. వాట్సాప్ చానల్స్ పేరిట ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. భారతదేశంతో సహా 150కి పైగా దేశాలలో మెటా ఈ వాట్సాప్ ఛానెల్స్ ను ప్రారంభించింది. చానల్స్ వినియోగదారులు తమ ప్రైవసీకి ఎటువంటి భంగం కలుగకుండానే మన విషయాలను షేర్ చేయచ్చు.

WhatsApp Channels: విజయదేవరకొండ వాట్సాప్‌లో ఏం చేస్తున్నారు? మీరూ తెలుసుకోవచ్చు! ట్రై చేయండి..
Whatsapp Channels
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Sep 15, 2023 | 7:15 AM

ఈ 20 ఏళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. అంటూ ప్రభాస్ మిర్చి సినిమాలో చెప్పిన డైలాగ్ బాక్స్ ఆఫీస్ ను ఎంత షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇదే డైలాగ్ ను వాట్సాప్ కూడా వర్తింపజేయాలేమో ఇప్పుడు.. ఇన్నేళ్లు నడిచిన వాట్సాప్ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అనేట్టుగా కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకూ వాట్సాప్ లో మనం చాటింగ్ చేయాలన్నా.. అవతలి వాళ్ల స్టేటస్, ప్రోఫైల్ పిక్ ఏదైనా చూడాలన్నా వారి నంబర్ మన దగ్గర ఉండాల్సిందే. మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి వారితోనే మనం ఇప్పటి వరకూ వాట్సాప్ లో చాటింగ్లు చేశాం. అయితే దీని పరిధిని మరింత పెంచుతూ వాట్సాప్ కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. వాట్సాప్ చానల్స్ పేరిట ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. భారతదేశంతో సహా 150కి పైగా దేశాలలో మెటా ఈ వాట్సాప్ ఛానెల్స్ ను ప్రారంభించింది. చానల్స్ వినియోగదారులు తమ ప్రైవసీకి ఎటువంటి భంగం కలుగకుండానే మన విషయాలను షేర్ చేయచ్చు. మన చానల్ ని ఫాలో అవుతున్న వారు మన షేర్ చేసిన కంటెంట్ మాత్రమే చూడగలుగుతారు. దీనికి సంబంధించిన విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. వాట్సాప్ ఛానెల్‌లు చాట్‌ల నుండి వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. దీనిలో మంచి విషయం ఏమిటంటే మనం ఇతరులను ఫాలో అవుతున్నట్లు వేరే వారికి తెలియకపోవడం. అంతేకాక ఈ ఫీచర్ అడ్మిన్‌లు, ఫాలోవర్ల వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తుంది.

ప్రముఖలు ప్రారంభించారు.. వాట్సాప్ ప్రారంభించిన కొత్త ఫీచర్ను అప్పుడే బాలీవుడ్, టాలీవుడ్ సెలిబ్రిటీలు వినియోగించడం మొదలు పెట్టారు. ఇప్పటికే వేల కొలదీ ఫాలోవర్లు ఆ చానల్స్ కు వచ్చారు. వారిలో హీరోయిన్ కత్రినా కైఫ్, హీరోలు అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ, దిల్జిత్ దోసాంజ్, నేహా కక్కర్ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఏంటి వాట్సాప్ చానల్.. మీరు ఫాలో అయ్యే వ్యక్తులు లేదా సంస్థల నుంచి అప్‌డేట్‌లను పొందడానికి మీకు అందుబాటులోకి వస్తున్న కొత్త ప్రైవేట్ మార్గం ఈ వాట్సాప్ చానల్. దీని లాంచింగ్ సందర్భంగా మెటా సీఈఓ జుకర్ బర్గ్ మాట్లాడుతూ ఛానెల్‌లకు మీ అందరినీ పరిచయం చేయడానికి సంతోషిస్తున్నానన్నారు. మెటా వార్తలు, అప్‌డేట్‌లను షేర్ చేయడానికి తాను ఈ ఛానెల్‌ని ప్రారంభిస్తున్నాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మీతో కనెక్ట్ అవ్వడానికి ఎదురు చూస్తున్నానని జుకర్‌బర్గ్ అన్నారు.

ఛానెల్స్ ను ఎలా ఉపయోగించాలి..

  • ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. మొదటిగా మీరు మీ వాట్సాప్ యాప్‌ని తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలి.
  • అనంతరం వాట్సాప్ తెరిచి స్క్రీన్ దిగువన అందుబాటులో ఉన్న అప్ డేట్స్ ట్యాబ్‌పై నొక్కండి. మీరు అనుసరించగల ఛానెళ్ల జాబితా మీకు కనిపిస్తుంది.
  • మీకు నచ్చిన ఛానెల్‌ని ఫాలో అవడానికి , దాని పేరు పక్కన ఉన్న ‘+’ బటన్‌పై నొక్కండి. ప్రొఫైల్ వివరణను వీక్షించడానికి, మీరు కేవలం ఛానెల్ పేరుపై నొక్కితే చాలు.
  • ఛానెల్ అప్‌డేట్‌కు ప్రతిస్పందనను జోడించడానికి, సందేశాన్ని నొక్కి పట్టుకోండి చాలు.

అడ్మిన్స్ మాత్రమే చూడగలరు..

వాట్సాప్ ఛానల్స్‌ సాధారణ వాట్సాప్ చాట్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఒక ఛానల్‌ను ఎవరు ఫాలో అవుతున్నారో అడ్మిన్స్ మాత్రమే చూడగలరు. అంటే ఒకరి ఐడెంటిటీ ఇతర ఫాలోవర్లకు కనిపించదు. చాలా సీక్రెట్‌గా ఉంటుంది. ఛానల్స్‌ వన్-వే కాబట్టి అడ్మిన్లు మాత్రమే మెసేజెస్ పంపడం కుదురుతుంది. ఫలితంగా అడ్మిన్లు, ఫాలోవర్ల ప్రైవసీ భద్రంగా ఉంటుంది.

చానళ్లకు కొత్త అప్ డేట్లు..

ప్రపంచ వ్యాప్తంగా ఈ చానల్స్ ఫీచర్ అందుబాటులో వస్తున్నందున త్వరలో కొన్ని కొత్త అప్ డేట్లు చానల్స్ ఫీచర్ కుయాడ్ కానున్నాయి. అవేంటంటే..

చానెళ్ల జాబితా.. మీ దేశం ఆధారంగా దానంతటే అదే ఫిల్టర్ చేయబడే ఛానెల్‌లను మీరు కనుగొనవచ్చు. మీరు అనుచరుల సంఖ్య ఆధారంగా కొత్త, అత్యంత యాక్టివ్, జనాదరణ పొందిన ఛానెల్‌లను కూడా వీక్షించవచ్చు.

రియాక్షన్స్.. చానెల్లో వస్తున్న కంటెంట్కు మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎమోజీలను ఉపయోగించవచ్చు. మీరు ఎలా స్పందిస్తారో ఇతర ఫాలోవర్లకు కనిపించదు.

ఎడిటింగ్.. అడ్మిన్లు తమ కంటెంట్ ను 30 రోజుల వరకూ ఎడిట్ చేసే వీలుంటుంది. అయితే ఆ తర్వాత వాట్సాప్ సర్వర్ల నుంచి అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది.

ఫార్వార్డింగ్.. మీరు చాట్‌లు లేదా సమూహాలకు అప్‌డేట్‌ను ఫార్వార్డ్ చేసినప్పుడల్లా అది ఛానెల్‌కి లింక్‌ని కలిగి ఉంటుంది, తద్వారా వ్యక్తులు మరింత తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..