Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి..!

Whatsapp Shortcuts: ప్రస్తుతం వాట్సాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ అంటూ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి..

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 19, 2021 | 9:04 PM

Whatsapp Shortcuts: ప్రస్తుతం వాట్సాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ అంటూ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోవడంతో వినియోగదారుల కోసం వాట్సాప్‌ సంస్థ మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆఫీస్‌ వర్క్‌ కోసం డెస్క్‌టాప్‌లో ట్యాబ్‌లను ఓపెన్‌ చేసుకోవడంతోపాటు ‘వెబ్‌ వాట్సాప్‌’ను ఓ భాగం చేసుకుంటూ ఉంటాము. అయితే మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఓపెన్‌ చేస్తుంటారు. దీని వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్‌ అలర్ట్‌ను పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూసేద్దాం.

మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌:

వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్‌ చేసి చూస్తుంటాము. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూసినట్లు తెలిసిపోతుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడకుండా ఉండేలా కూడా చేయవచ్చు. ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి మారిపోతుంది.

సెర్చ్‌ చాట్‌:

వాట్సాప్‌ గ్రూపుల్లోని చాటింగ్‌ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. చాటింగ్ సెక్షన్‌ కోసం ctrl+alt+shift+f క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

పిన్‌ చాట్‌:

సాధారణంగా ముఖ్యమైన వాట్సాప్‌ గ్రూపులు ఉంటే మనకు ఎప్పుడు ముందు కనిపించేలా పిన్‌ చాట్‌ చేస్తుంటాము. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం షార్ట్‌కట్‌లో ctrl+alt+shift+p క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

న్యూ గ్రూప్‌, న్యూ చాట్‌:

అయితే కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునేందుకు ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. ఇక న్యూ చాట్‌ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

ఎగ్జిట్‌ గ్రూప్‌:

ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే సాధారణంగా గ్రూప్‌లోని మూడు చుక్కలపై క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.

ఇన్‌క్రీజ్‌ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆప్‌ సెలెక్టెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ :

మీరు ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ను పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్‌ ఉంది. shift+. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సెట్టింగ్స్‌ :

వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలంటే ఏవేవో నొక్కాల్సిన అవసరం లేదు. ముందుగా మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమి ఉండకుండా డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

మ్యూట్‌ :

ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే సింపుల్‌. ctrl+alt+shift+M ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.

ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ :

యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు సింపుల్‌గా ఉంటుంది. ctrl+alt+P క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఆర్కివ్‌ చాట్‌:

మామూలుగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌ను గానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సులభం చేసుకోవచ్చు. అందుకు ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి:

WhatsApp Scam: మీకు ఈ వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయా..? జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే..!

BHIM App: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ నంబర్‌ ఉపయోగించి భీమ్‌ యాప్‌ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు.. ఎలాగంటే..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..