WhatsApp New Update: వాట్సాప్ నుంచి మరో స్టన్నింగ్ అప్ డేట్.. ఇక అవి డీఫాల్ట్‌గానే షేరింగ్..

వాట్సాప్ లో చాట్ ల ద్వారా హెచ్‌డీ ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడానికి అవకాశం ఏర్పడనుంది. ఈ ఫీచర్ గతంలో బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్‌తో వాట్సాప్ వినియోగదారులు ఎవరితోనైనా మీడియా ఫైల్‌లను షేర్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ హెచ్ డీ మోడ్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు.

WhatsApp New Update: వాట్సాప్ నుంచి మరో స్టన్నింగ్ అప్ డేట్.. ఇక అవి డీఫాల్ట్‌గానే షేరింగ్..
Whatsapp
Follow us
Madhu

|

Updated on: Jun 24, 2024 | 2:17 PM

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది వినియోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ విశేషాదరణ పొందింది. విద్యార్థుల నుంచి వ్యాపారుల వరకూ అందరూ వయసుతో తేడా లేకుండా దీనిని వినియోగిస్తుంటారు. కేవలం చాటింగ్ కోసమే కాకుండా స్టేటస్, గ్రూప్స్, కమ్యూనిటీలు, చానెల్స్ వంటి వాటితో వాట్సాప్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఎప్పటికప్పుడు ప్రజలకు కొత్త అప్ డేట్ లను అందిస్తూ వాట్సాప్ ను ఎప్పుడూ కొత్తగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో గతేడాది హెచ్ డీ ఫొటోలు, వీడియోలను పంపే ఆప్షన్ ను వాట్సాప్ తీసుకొచ్చంది. అంటే వినియోగదారులు కంప్రెస్ చేయని మీడియా ఫైల్‌లను అందరితో పంచుకోవడానికి అనుమతించింది. దీనికి అదనపు హంగులను జోడిస్తూ మరో కొత్త ఫీచర్ మెటా ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇది చాట్‌ల ద్వారా డిఫాల్ట్‌గా హెచ్‌డీ ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇకపై హెచ్‌డీ ఫోటోలు షేర్..

వాట్సాప్ లో చాట్ ల ద్వారా హెచ్‌డీ ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడానికి అవకాశం ఏర్పడనుంది. ఈ ఫీచర్ గతంలో బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్‌తో వాట్సాప్ వినియోగదారులు ఎవరితోనైనా మీడియా ఫైల్‌లను షేర్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ హెచ్ డీ మోడ్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు స్టోరేజ్, డేటా విభాగంలో మీడియా అప్‌లోడ్ నాణ్యత ట్యాబ్‌ను యాక్సెస్ చేయడం ద్వారా హెచ్డీ నాణ్యతను సెట్ చేయవచ్చు.

మూడు నెలల క్రితమే గుర్తింపు..

దాదాపు మూడు నెలల కిందటే వాబీటా ఇన్ఫో ద్వారా ఈ ఫీచర్ ను గుర్తించారు. ఇప్పుడు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.13.10 లో అందుబాటులో ఉందని పలు ఆన్ లైన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫీచర్ ను ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా పరీక్షించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని నిర్ధారిస్తున్నారు.

ఇది గుర్తుంచుకోవాలి..

అయితే డీఫాల్ట్ హెచ్డీ మీడియా ఫైల్స్ షేరింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినా.. దీని వల్ల వినియోగదారులకు అధిక డేటా వినియోగంతో పాటు స్టోరేజ్ ఎక్కువ అవసరం అవుతుంది. ఈ విషయాన్ని వినియోగదారులు మననంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, పరిమిత డేటా ప్లాన్‌లను కలిగి ఉన్న వినియోగదారులు డిఫాల్ట్‌గా ఈ ఫీచర్‌ను ప్రారంభించేముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాట్సాప్‌లో పొడవైన వీడియోలను భాగస్వామ్యం చేయడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం వీడియోల కోసం గరిష్టంగా 64ఎంబీ ఫైల్ పరిమాణ పరిమితిని మాత్రమే భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది. దీనర్థం దీర్ఘ రన్‌టైమ్ ఉన్న హెచ్డీ వీడియోలు ఈ మీడియా ఫైల్‌లను భాగస్వామ్యం చేయడంలో ఇబ్బందిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా, నెమ్మదిగా ఇంటర్నెట్ కనెక్షన్‌లు ఉన్న వినియోగదారులు ఈ ఫైల్‌లను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు లేదా డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు లాగ్ లేదా స్లో అప్‌లోడ్ వేగం కూడా అనుభవించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..