AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POCO C65: పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 6500కే సూపర్‌ ఫీచర్స్‌

అయితే ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. పోకో సీ65లో మంచి ఫీచర్లను అందించారు. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 1650*720 రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్రాస్ 3ని అందించారు. ఈ ఫోన్‌లో మీడియో టెక్ హీలియో జి 85 ప్రోసెసర్‌ను అందిచారు...

POCO C65: పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 6500కే సూపర్‌ ఫీచర్స్‌
Poco C65
Narender Vaitla
|

Updated on: Jun 24, 2024 | 3:08 PM

Share

ఈ కామర్స్‌ సంస్థలు స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్ ప్రకటించడం సర్వసాధారణమైన విషయం. అయితే మొన్నటి వరకు కేవలం ప్రత్యేకంగా సేల్స్‌ ఉన్న సమయంలోనే డిస్కౌంట్స్‌ అందించే వారు. కానీ ప్రస్తుతం సేల్స్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్‌ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా చెప్పొచ్చు.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ పోకోకు చెందిన ఫోన్‌పై ఈ డస్కౌంట్‌ లభిస్తోంది. పోకో సీ65 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఏకంగా 38 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. పోకోసీ65 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ.10,999కాగా 38 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,799కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 6వేలలోనే పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఫస్ట్‌ పేమెంట్‌ చేస్తే రూ. 50 డిస్కౌంట్‌ పొందొచ్చు.

అయితే ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. పోకో సీ65లో మంచి ఫీచర్లను అందించారు. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 1650*720 రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్రాస్ 3ని అందించారు. ఈ ఫోన్‌లో మీడియో టెక్ హీలియో జి 85 ప్రోసెసర్‌ను అందిచారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, డ్యూయల్ బాండ్ వైఫై, యూఎస్‌బి టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌క సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు