Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కొత్తగా చెప్పాలనుకుంటున్నారా.? అయితే ఇలా ట్రై చేయండి..

Independence Day: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలంతా సంతోషంగా గడపుకుంటున్నారు. జాతీయజెండాను ఎగరవేస్తూ, జాతీయగీతాన్ని ఆలపిస్తూ పండగలా వేడకను...

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కొత్తగా చెప్పాలనుకుంటున్నారా.? అయితే ఇలా ట్రై చేయండి..
Whatsapp Independence Day

Updated on: Aug 15, 2021 | 11:16 AM

Independence Day: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలంతా సంతోషంగా గడపుకుంటున్నారు. జాతీయజెండాను ఎగరవేస్తూ, జాతీయగీతాన్ని ఆలపిస్తూ పండగలా వేడకను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంధు, మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విషెస్‌ చెబుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఇండిపెన్‌డెన్స్‌ డేకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. అయితే ఫొటోలతో శుభాకాంక్షలు కాకుండా సరికొత్తగా విషెస్‌ చెప్పాలనుకుంటున్నారా.? మీ కోసమే వాట్సాప్‌ సరికొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా వాట్సాప్‌ స్టిక్కర్లను తీసుకొచ్చింది. మరి ఈ స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.? ఎలా పంపించాలో స్టెప్‌ బై స్టెప్‌ తెలసుకుందాం..

 

* ముందుగా గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సెర్చ్‌ ఆప్షన్‌లో ‘Independence Day WhatsApp Stikcers’ అని టైప్‌ చేయాలి.
* అనంతరం ఏదైనా స్టిక్కర్‌ ప్యాక్‌ను ఎంచుకొని యాడ్‌ టు వాట్సాప్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
* ఇక వాట్సాప్‌ ఓపెన్‌ చేసి మీరు ఎవరికైతే మెసేజ్‌ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్‌పై క్లిక్‌ చేసి.. స్కిక్కర్‌ విభాగాన్ని ఎంచుకోవాలి.
* ప్లేస్టోర్‌లో మీరు యాడ్‌ చేసిన స్టిక్కర్లన్ని కనిపిస్తాయి.
* అందులో నుంచి ఇండిపెన్‌డెన్స్‌కు సంబంధించిన స్టిక్కర్‌ను సెలక్ట్‌చేసుకొని సెండ్‌ చేస్తే సరిపోతుంది.

Also Read: India Inline Hockey: భారత ఇన్‌లైన్ హాకీ టీమ్‌కు ఎంపికైన ప్రీతి నిగమ్, నగేష్‌ల తనయుడు ఆర్యన్

Japan Mayor Bite: అథ్లెట్ గోల్డ్‌ మెడల్‌ను కొరికిన మేయర్‌.. కొత్త పతకం ఇస్తామన్న ఒలింపిక్‌ నిర్వాహకులు. అసలేమైందంటే.

Karate Kalyani : రాజకీయాల్లోకి కరాటే కళ్యాణి.. విజయశాంతి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న నటి