Japan Mayor Bite: అథ్లెట్ గోల్డ్‌ మెడల్‌ను కొరికిన మేయర్‌.. కొత్త పతకం ఇస్తామన్న ఒలింపిక్‌ నిర్వాహకులు. అసలేమైందంటే.

Japan Mayor Bite Medal: ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించాలనేది ప్రతీ ఒక్క క్రీడకారుడి కల. దాని కోసమే ప్లేయర్స్‌ జీవితం మొత్తం కృషి చేస్తూనే ఉంటారు. మెడల్‌ సాధించంగానే సంతోషంలో...

Japan Mayor Bite: అథ్లెట్ గోల్డ్‌ మెడల్‌ను కొరికిన మేయర్‌.. కొత్త పతకం ఇస్తామన్న ఒలింపిక్‌ నిర్వాహకులు. అసలేమైందంటే.
Japan Medal Bite
Follow us

|

Updated on: Aug 15, 2021 | 10:50 AM

Japan Mayor Bite Medal: ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించాలనేది ప్రతీ ఒక్క క్రీడకారుడి కల. దాని కోసమే ప్లేయర్స్‌ జీవితం మొత్తం కృషి చేస్తూనే ఉంటారు. మెడల్‌ సాధించంగానే సంతోషంలో ప్లేయర్స్‌ మెడల్స్‌ను నోటితో కొరుకుతుంటారు. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో మెడల్‌ను నోటిలో పెట్టుకోకుండా ఆంక్షలు విధించారు. అయితే జపాన్‌కు చెందిన ఓ మేయర్‌ చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దేశానికి చెందిన ప్లేయర్‌ సాధించిన మెడల్‌ను నోట్లో పెట్టుకోవడం చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన అథ్లెట్ మియూ గోటో స్టాఫ్‌ బాల్‌లో గోల్డ్‌ మెడల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా జపాన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మియూ హాజరైంది. ఇదే కార్యక్రమానికి హాజరైన ఆ నగర మేయర్‌ టకాషి కవామురా మియూ నుంచి మెడల్‌ను తీసుకొని తన మెడలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ముఖానికి ఉన్న మాస్క్‌ను తీసేసి.. ఆ గోల్డ్‌ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. దీంతో విషయాన్ని గమనించిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకుల్ని సంప్రదించింది. దీంతో స్పందించిన నిర్వాహకులు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. మెడల్‌ మార్పడికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని ఒలింపిక్‌ నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే మేయర్‌ చేసిన ఈ బాధ్యతారాహిత్య పనికి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అథ్లెట్‌ విజయాన్ని అగౌరవపర్చారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ మేయర్‌కు వ్యతిరేకంగా దాదాపు 8000 మంది ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయంపై సదరు మేయర్‌ స్పందించారు. తాన ప్రవర్తననకు క్షమాపణలు తెలిపారు. అంతటితో ఆగకుండా మెడల్‌ను రీప్లేస్‌మెంట్‌ చేయడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: 75th independence day: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Karate Kalyani : రాజకీయాల్లోకి కరాటే కళ్యాణి.. విజయశాంతి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న నటి

Anupama Parameswaran: చీరకట్టులో దేవ కన్యలా.. ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్‌ లేటెస్ట్‌ ఫొటోలు.