Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉండడానికి ఈ ఫీచర్లే కారణం. యూజర్ల అవసరాలను అనుగుణంగా...

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.
Whatsapp

Updated on: Dec 26, 2022 | 8:49 AM

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉండడానికి ఈ ఫీచర్లే కారణం. యూజర్ల అవసరాలను అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. ‘డోంట్‌ డిస్బర్బ్‌’ అనే ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది. కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ డోంట్‌ డిస్బర్బ్‌ ఫీచర్‌ కేవలం వెబ్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. వెబ్‌ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్‌లను స్విచ్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు సెట్టింగ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఇన్‌కమింగ్ వాట్సాప్‌ కాల్‌ నోటిఫికేషన్‌లను ఆఫ్/ఆన్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే వాట్సాప్‌ గత కొన్ని రోజులుగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. మొన్నటి మొన్న కాంటాక్ట్ కార్డ్‌లను షేర్ చేసే ఫీచర్‌ను తెచ్చిన వాట్సాప్‌ అవతార్‌ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అవతార్‌ ఫీచర్‌ సహాయంతో మీ ప్రొఫైల్‌ ఫొటోను డిజిటల్ వెర్షన్‌ను రూపొందించుకోవచ్చు. ఫొటోకు హెయిర్‌ స్టైల్‌, ఫేషియల్‌ ఫీచర్‌లను యాడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..