AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo S16 Series: వీవో నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

ప్రముఖ కంపెనీ వీవో మొబైల్‌ తయారీ కంపెనీ గత కొన్ని నెలలుగా గ్లోబల్ మార్కెట్‌లో ఒకదాని తర్వాత ఒకటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. కొత్త సంవత్సరం కొత్త కొత్త..

Vivo S16 Series: వీవో నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..
Vivo Mobile
Subhash Goud
|

Updated on: Dec 25, 2022 | 12:48 PM

Share

ప్రముఖ కంపెనీ వీవో మొబైల్‌ తయారీ కంపెనీ గత కొన్ని నెలలుగా గ్లోబల్ మార్కెట్‌లో ఒకదాని తర్వాత ఒకటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. కొత్త సంవత్సరం కొత్త కొత్త వెర్షన్లలో ఆకర్షణీయమైన మొబైల్స్ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఇటీవల Vivo తన Y సిరీస్‌లో నాలుగు ఫోన్‌లను ఆవిష్కరించింది. ఇప్పుడు కంపెనీ వీవో ఎస్‌16 సిరీస్ కింద మూడు అద్భుతమైన మొబైల్‌లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Vivo S16, Vivo S16 Pro, Vivo S16e స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు గొప్ప ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్‌తో ఉంటాయి. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల గురించిన ఇక్కడ తెలుసుకోండి.

Vivo S16 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల FullHD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 870 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే 12GB RAM మరియు 256GB ఇంబిల్ట్ స్టోరేజ్ పొందింది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రధాన కెమెరా 64MP సెన్సార్, రెండవ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు మూడవ కెమెరా 2MP మాక్రో యూనిట్. ఇది కాకుండా, 50MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

Vivo S16 Pro స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల పూర్తి HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 8200 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Android 13 ఆధారిత OriginOS 3.0 మద్దతుతో పని చేస్తుంది. అలాగే 12GB RAM మరియు 512GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరాలో 50MP సెన్సార్ ఉంది. ఇది కాకుండా, ఇది 50MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తుంది

ఇవి కూడా చదవండి

వీవో ఎస్‌16e స్మార్ట్‌ఫోన్ 6.62-అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది Samsung Exynos 1080 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంటుంది. ఇక్కడ ప్రధాన కెమెరా 50MP, రెండవ కెమెరా 2MP మాక్రో లెన్స్, మూడవ కెమెరా 2MP డెప్త్ సెన్సార్. ఇందులో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

అయితే వీవో ఎస్‌ 16 సిరీస్ ఇంకా భారతీయ మార్కెట్లోకి రాలేదు. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో విడుదలైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పరిశీలిస్తే వీవో ఎస్‌16 ధర సీఎన్‌వై 2,499. ఇది భారతదేశంలో దాదాపు రూ. 29,600 ఉండవచ్చు. అలాగే వీవో ఎస్‌16 ప్రో ధర సీఎన్‌వై 3,299 (సుమారు రూ. 39,100) వద్ద ప్రారంభమవుతుంది. వీవో ఎస్‌16 ధర సీఎన్‌వై 2,099 (దాదాపు రూ. 24,900).

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి