Tech tips: ఫోన్‌ను ఎక్కువ బ్రైట్‌నెస్‌తో వాడుతున్నారా.? మీ కళ్లకే కాదు, ఫోన్‌కు ముప్పు తప్పదు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఫోన్లతోనే కుస్తీ పడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్‌లతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అదే విధంగా దుష్ప్రభావాలు..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఫోన్లతోనే కుస్తీ పడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్‌లతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అదే విధంగా దుష్ప్రభావాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగం కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక బ్రైట్‌నెస్ ఎక్కువ పుట్టుకొని ఫోన్‌ను ఉపయోగిస్తే జరిగే నష్టం ఎలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంగా ఇలాగే కొనసాగితే కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఓవర్ బ్రైట్‌నెస్ కేవలం కంటి ఆరోగ్యంపై మాత్రమే కాకుండా ఫోన్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ బ్రైట్‌నెస్ కారణంగా ఫోన్ ఛార్జింగ్ త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. దీంతో ఇది కాలక్రమేణ ఫోన్ బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. ఇక బ్రైట్‌నెస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాసెసర్‌పై కూడా ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగా ఫోన్ హ్యాంగ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి ఫోన్ పనితీరు తగ్గుతుంది.
ఇక ఫోన్ బ్రైట్‌నెస్ మరీ ఎక్కువగా ఉండడం వల్ల అది డిస్‌ప్లేపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే హీట్ జనరేట్ అవుతుంది. దీంతో ఇది డిస్‌ప్లే పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా డిస్‌ప్లే పోయే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే డార్క్ మోడ్‌ను ఉపయోగిస్తే మరింత బెటర్ అని సూచనలిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..