WhatsApp: వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఆప్షన్.. భారీగా పెరగనున్న ‘డిలీట్ ఫర్ ఎవిరివన్’ సమయం..
WhatsApp: ఎన్ని రకాల మెసేసింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం వాట్సాప్ తీసుకొచ్చే ఫీచర్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు...
WhatsApp: ఎన్ని రకాల మెసేసింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం వాట్సాప్ తీసుకొచ్చే ఫీచర్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఎవరికైనా పొరపాటున పంపించిన మెసేజ్‌ను డిలిట్ చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ‘డిలీట్ ఫర్ ఎవరివన్’ ఆప్షన్ ద్వారా ఎదుటి వారికి పంపిన మెసేజ్‌ను కూడా డిలీట్ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ సమయం 1 గంట, 8 నిమిషాలు, 16 సెకన్లుగా ఉంది. అంటే ఈ సమయంలో ఎప్పుడు మెసేజ్‌ను డిలీట్ చేసినా ఇతరుల చాట్ బాక్స్‌లో కూడా మెసేజ్ డిలీట్ అవుతుంది. అయితే తాజాగా వాట్సాప్ ఈ ఆప్షన్‌కు అప్‌డేట్ ఇస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫోలో తెలిపిన వివరాల ప్రకారం.. డిలీట్ ఫర్ ఎవరి వన్ ఆప్షన్ సమయాన్ని ఏకంగా 2 రోజుల 12 గంటల వరకు పొడగించనున్నారు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను పరీక్షిస్తున్నారు. త్వరలోనే ఈ అప్షన్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లు తప్పుగా పంపిన మెసేజ్‌లను రెండున్నర రోజుల వరకు డిలీట్ చేసుకునే అశకాశం ఉంటుందన్నమాట.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..