ఏడాది చివరి నాటికి వాట్సాప్ పేమెంట్ సేవలు

ఇప్పటి వరకు వాట్సాప్ అంటే మనకు సోషల్‌మీడియా యాప్‌గా మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ దీని ద్వారా పేమెంట్ సేవల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సంస్ధ రెడీ అవుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రయల్ పేమెంట్ సర్వీస్‌ను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయనుంది. పూర్తిస్థాయిలో ఈ ఏడాది చివరినాటిని ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ అధినేత విల్ క్యాత్‌కర్ట్ చెప్పారు. భారత్‌ పర్యటనలో భాగంగా ఆయన పేమెంట్ సేవలపై పలు విషయాలు వెల్లడించారు. […]

ఏడాది  చివరి నాటికి  వాట్సాప్ పేమెంట్ సేవలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 9:49 PM

ఇప్పటి వరకు వాట్సాప్ అంటే మనకు సోషల్‌మీడియా యాప్‌గా మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ దీని ద్వారా పేమెంట్ సేవల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సంస్ధ రెడీ అవుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రయల్ పేమెంట్ సర్వీస్‌ను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయనుంది. పూర్తిస్థాయిలో ఈ ఏడాది చివరినాటిని ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ అధినేత విల్ క్యాత్‌కర్ట్ చెప్పారు.

భారత్‌ పర్యటనలో భాగంగా ఆయన పేమెంట్ సేవలపై పలు విషయాలు వెల్లడించారు. ఇండియాలో మొత్తం 400 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులున్నట్టుగా చెప్పారు. వీరిలో 10 లక్షల మంది యూజర్లపై ఏడాది కాలంగా పేమెంట్ సేవల ట్రయల్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో డిజిటల్ లావాదేవీలకు వాట్సాప్ పేమెంట్ ఎంతో సహకారిగా ఉండబోతుందన్నారు క్యాత్‌కర్ట్.

ఇదిలా ఉంటే ఇప్పటికే వినియోగదారులు పూర్తిస్దాయిలో ఇప్పుడు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి సేవల్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ పేమెంట్ వస్తే వీటి మధ్య పోటీ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ జూలైతే ట్రయల్ పూర్తి కానున్న నేపథ్యంలో యూజర్స్ కూడా ఈ సేవల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.